ఈ మధ్య కాలంలో తమిళంలో ఊహించని విజయం సాధించిన సినిమా అంటే.. ‘అమరన్‘యే. శివకార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరియస్వామి రూపొందించిన చిత్రమిది. ముకుంద్ వరదరాజన్ అనే దివంగత సైనికుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు వదిలిన అమర వీరుడాయన. ఇలాంటి కథలో బాలీవుడ్లోనే కాక సౌత్ ఇండియాలోనూ వచ్చాయి. ‘మేజర్’ కూడా ఆ కోవలోనిదే. ఐతే ‘అమరన్’ చిత్రాన్ని చాలా హృద్యంగా, ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన రాజ్ కుమార్ ప్రేక్షకుల మనసులు దోచాడు.
శివకార్తికేయన్, సాయిపల్లవిల అద్భుత నటన కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. మామూలుగా ఇలాంటి రియల్ లైఫ్ బయోపిక్‌లకు ఓ మోస్తరు వసూళ్లే వస్తుంటాయి. కానీ ‘అమరన్’ ఏకంగా రూ.300 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. దర్శకుడి మీద సర్వత్రా ప్రశంసలు కురిశాయి.తాజాగా దళపతి విజయ్ కూడా రాజ్ కుమార్‌ను పిలిచి అభినందించాడు. విజయ్ స్థాయి హీరో ఇలా చేయడం ఆసక్తి రేకెత్తించింది. ఈ కలయిక గురించి రాజ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘అయరన్’ సినిమా కనుక ముందు రిలీజై ఉంటే.. మన ఇద్దరం కలిసి సినిమా చేసేవాళ్లమని విజయ్ అన్నట్లు అతను వెల్లడించాడు.
పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న తాను.. చివరి చిత్రాన్ని ఇప్పటికే కన్ఫమ్ చేసేశానని.. కాబట్టి ఇప్పుడు కలిసి సినిమా చేయడానికి అవకాశం లేదని విజయ్ చెప్పినట్లు రాజ్ కుమార్ తెలిపాడు. ఆ మాట చెప్పాక తనతో ఫొటో దిగి, ప్రౌడ్ ఆఫ్ యు అని చెప్పానని.. విజయ్‌తో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చి ఉంటే గొప్పగా ఉండేదని రాజ్ కుమార్ తెలిపాడు. ‘అమరన్’ ఇంకో నాలుగు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్‌కు రాబోతోంది.
This post was last modified on November 30, 2024 5:17 pm
సినిమాలకు సంబంధించి థియేటర్లు, ఓటిటిల మధ్యే పోటీ ఉండటం చూశాం కానీ తాజాగా ఇప్పుడీ లిస్టులో ఆన్ లైన్ టికెట్…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే,…
అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన "రామన్ రాఘవ్ 2.0" సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శోభిత. అనంతరం అడవి శేష్ గూడచారి,…
మొన్న ఈటీవీ విన్ ఓటిటిలో రిలీజైన 'క' దాదాపుగా ఒక రోజు మొత్తం పైరసీ కాకుండా కట్టడి చేయడంలో సదరు…
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు రేపు ఆదివారం కావడంతో ఈ రోజు…
గత నెల మంచి అంచనాల మధ్య విడుదలైన శ్రీ విష్ణు సినిమా ‘స్వాగ్’ థియేటర్లలో అనుకున్నంత మేర ఆడలేకపోయింది. నెగెటివ్…