మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ప్రీమియర్ షోలు, టికెట్ రేట్లకు సంబంధించిన తెలంగాణ అనుమతులు, పెంపులు వచ్చేసాయి. ఈ మేరకు అధికారిక జిఓ విడుదల చేశారు. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ మూవీకి ఇవ్వనంత హైక్ ఇవ్వడం విశేషం. బడ్జెట్, హైప్, ప్యాన్ ఇండియా క్రేజ్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న సర్కార్ ధారాళంగా ఆలోచించింది. డిసెంబర్ 4 రాత్రి 9.30 కే తొలి షో వేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. అయితే ఈ ఒక్క ఆటకు మాత్రం 800 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగటున సింగల్ స్క్రీన్ కు 1121 రూపాయలు, మల్టీప్లెక్సుకు 1239 రూపాయలు కావొచ్చు.
డిసెంబర్ 5 అర్ధరాత్రి 1 గంట ఆపై తెల్లవారుఝామున 4 గంటలకు కలిపి ఎక్స్ ట్రా రెండు షోలకు అనుమతి ఇచ్చారు. మొదటి నాలుగు రోజులు అంటే ఎనిమిదో తేదీ దాకా సింగల్ స్క్రీన్లు అదనంగా 150 మల్టీప్లెక్సులు 200 రూపాయలు, తొమ్మిదో తేదీ నుంచి పదహారు వరకు సింగల్ స్క్రీన్లు అదనంగా 105 మల్టీప్లెక్సులు 150 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. ఆ తర్వాత పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు సింగల్ స్క్రీన్లు అదనంగా 20 మల్టీప్లెక్సులు అదనంగా 50 రూపాయలు తీసుకోవచ్చు. అంటే పంతొమ్మిది రోజుల పాటు పుష్ప 2ని రెగ్యులర్ గా ఉండే రేట్లతో చూడటం సాధ్యం కాదన్న మాట. సో రికార్డు నెంబర్లు ఖాయం.
ఏ క్షణమైనా బుకింగ్స్ తెరిచేందుకు పేటిఎం, బుక్ మై షోతో పాటు కొత్తగా జొమాటో ప్రారంభించిన డిస్ట్రిక్ట్ యాప్ సిద్ధమవుతున్నాయి. రేట్లను సవరించిన వెంటనే అమ్మకాలు మొదలుపెట్టబోతున్నారు. హిందీలో ఇప్పటికే అమ్మకాలు షురూ కాగా గంటకు 8 వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే కోటి గ్రాస్ నమోదైపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముందు రోజు షో చూసే ఛాన్స్ ఉండటంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఇకపై రోజుల తరబడి సోషల్ మీడియాలో రికార్డుల గురించి మాట్లాడుకుంటూ అలసిపోయేలా ఉన్నారు.
This post was last modified on November 30, 2024 3:04 pm
మాములుగా చిన్న సినిమాలే ముందు రోజు ప్రీమియర్లకు భయపడుతున్న రోజులివి. టాక్ బాగా వస్తే సోషల్ మీడియా సహాయంతో అదే…
పవన్ కళ్యాణ్ను దాదాపు ఏడాది నుంచి ఎవ్వరూ పవర్ స్టార్ అని పిలవట్లేదు. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నపుడే పేరు…
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్కు పెద్ద షాకే ఇచ్చాడు బుచ్చిబాబు సానా. షాకింగ్ ట్విస్టుతో లవ్ స్టోరీ తీసి.. ప్రేక్షకులను…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోఘన విజయం దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి పోస్టు…
కలియుగ ప్రత్యక్ష దైవరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు కుటుంబసమేతంగా వెళుతుంటారు. ప్రశాంతంగా శ్రీవారిని…