Movie News

‘పవర్ స్టార్’ ఈజ్ బ్యాక్!

పవన్ కళ్యాణ్‌ను దాదాపు ఏడాది నుంచి ఎవ్వరూ పవర్ స్టార్ అని పిలవట్లేదు. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నపుడే పేరు పక్కన ఆ ట్యాగ్ కనిపిస్తుంది. ఐతే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసమని ఆయన ఏడాది కిందటే సినిమాలన్నీ పక్కన పెట్టేశారు. పూర్తి స్థాయిలో జనసేనానిగా మారిపోయి ఎన్నికల రణరంగంలో తలపడ్డారు. ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. దీంతో ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర్నుంచి ఆయన్ని డీసీఎం అనే ట్యాగ్‌తోనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ మళ్లీ ‘పవర్ స్టార్’ అవతారం ఎత్తుతున్నాడు. రాజకీయాల కోసం పక్కన పెట్టేసిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి పవన్ నిర్ణయించుకున్నారు.

ముందుగా ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా పనిని పున:ప్రారంభిస్తున్నారు. పవన్ ఈ సినిమా చివరి దశ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఈ చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. నిన్నటిదాకా కనిపించిన గడ్డం లుక్‌లోనే పవన్ షూటింగ్‌కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైంది క్రిష్ దర్శకత్వంలో కాగా.. పవన్ రాజకీయాలు, వేరే చిత్రాల్లో బిజీ అవడం, ఈ సినిమా మరీ ఆలస్యం అవుతుండడంతో ఆయన చివరి దశలో తప్పుకున్నాడు.

మిగతా సినిమాను పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. తన దర్శకత్వంలోనే చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తూనే కొంత వీలు చేసుకుని పవన్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. మరో పెండింగ్ మూవీ ‘ఓజీ’ని కూడా త్వరగానే పూర్తి చేయాలని పవన్ చూస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మాత్రం ఇప్పట్లో డేట్లు ఇచ్చేలా కనిపించడం లేదు పవన్.

This post was last modified on November 30, 2024 2:38 pm

Share

Recent Posts

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

59 minutes ago

పంజాబ్‌ చిత్కార యూనివ‌ర్సిటీలో ఏం జరుగుతుంది?

పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న‌ చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…

2 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

2 hours ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

3 hours ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

8 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

12 hours ago