Movie News

బుచ్చి పాన్ ఇండియా మాస్ లోడింగ్!

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పెద్ద షాకే ఇచ్చాడు బుచ్చిబాబు సానా. షాకింగ్ ట్విస్టుతో లవ్ స్టోరీ తీసి.. ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. కొత్త హీరో హీరోయిన్లు నటించిన సినిమాతో ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొట్టి అతను సంచలనం రేపాడు. ఇలా పెద్ద హిట్టుతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడికి వెంటనే అవకాశాలు వస్తాయి. హడావుడిగా ఏ ఛాన్స్ వస్తే దాన్ని ఒప్పేసుకుని సినిమా చేసేస్తుంటారు. కానీ బుచ్చిబాబు మాత్రం ఆలస్యమైనా సరే.. ఒక పెద్ద స్టార్‌తోనే సినిమా చేయాలని చాన్నాళ్లు ఎదురు చూశాడు.

ముందు ఎన్టీఆర్‌తో సినిమా అనుకుంటే కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. అది మిస్సయినా సరే.. రామ్ చరణ్‌తో సినిమా ఓకే అయి తన కెరీర్‌ను ఒకేసారి చాలా మెట్లు ఎక్కించేసింది. ‘గేమ్ చేంజర్’ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రం పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగిప్పటికీ ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం మామూలుగా లేవు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌ పెట్టుకున్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లబోతోంది.చిత్రీకరణ మొదలు కాబోతుండగా.. కాస్టింగ్ కూడా దాదాపుగా ఓకే అయిపోయింది. ‘మీర్జా పూర్’ సిరీస్‌లో మున్నా పాత్రతో మాంచి పాపులారిటీ సంపాదించిన దివ్యేందు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బహుశా అతడిది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే కావచ్చు. అంతకంటే ముందు జగపతిబాబును కూడా ముఖ్య పాత్రకు తీసుకున్నాడు బుచ్చి. ఆయనే మెయిన్ విలన్ కావచ్చు.

ఇక ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్.. ఈ చిత్రంలో కథానాయికగా చాన్నాళ్ల ముందే ఖరారైంది. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయిలో చరణ్ మంచి పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు జాన్వి, దివ్యేందు లాంటి ఆర్టిస్టులు తోడవడం.. దేశం మొత్తానికి తెలిసిన ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడంతో ఈ చిత్రానికి అసలైన పాన్ ఇండియా రంగు వచ్చేసింది. ఇది పక్కా మాస్ సినిమా అని.. కానీ కథ మాత్రం కొత్తగా ఉంటుందని.. చరణ్ కెరీర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లే సినిమా అని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మించనున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కావచ్చని తెలుస్తోంది.

This post was last modified on November 30, 2024 2:00 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

11 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago