మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి 16 కీలక షెడ్యూల్ పరుగులు పెడుతోంది. మైసూర్ లో జరుగుతున్న షూటింగ్ లో ప్రధాన తారాగణానికి సంబంధించిన సన్నివేశాలతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. విడుదల ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ అప్డేట్స్ ఇవ్వడంలో బుచ్చిబాబు టైం తప్పడం లేదు. క్యాస్టింగ్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ అభిమానులకు జోష్ ఇస్తున్నాడు. తాజాగా విలన్లలో ఒకరిగా నటిస్తున్న దివ్యేందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ద్వారా స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది.
మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో పరమ దుర్మార్గుడైన మున్నాగా నటించింది దివ్యేందునే. ముందు వెనుక చూడకుండా మనుషుల్ని చంపేస్తూ, పచ్చి బూతులతో అవతలి వాళ్ళ మీద విరుచుకుపడే క్యారెక్టర్ లో యూత్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేశాడు. ముఖ్యంగా అతని మ్యానరిజంకి వీర ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ మున్నానే రామ్ చరణ్ కోసం విలన్ గా మారుతున్నాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బుచ్చిబాబు ఫేవరేట్ క్యారెక్టర్ అనిపించుకునే రేంజ్ లో దివ్యేందుని డిజైన్ చేశారట. తనకు హీరోకు మధ్య వచ్చే ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఊరిస్తున్నారు. అయితే ఈ దివ్యేందు బ్యాక్ గ్రౌండ్ వెనుక ఆసక్తికరమైన సంగతులున్నాయి.
2007లో ఆజా నాచ్లే అనే ఫ్లాప్ మూవీతో పరిచయమైన దివ్యేందు ఆ తర్వాత బ్రేక్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశాడు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ లాంటి హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ ఊపందుకోలేదు. 2018లో మిర్జాపూర్ ఒప్పుకున్నాక ఇతని జాతకమే మారిపోయింది. ఒక్కసారిగా మున్నాగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దివ్యేందు ప్రధాన పాత్రలో అగ్ని అనే వెబ్ సిరీస్ కూడా రూపొందింది. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకోవడం ద్వారా మంచి ప్రమోషన్ అందుకున్నాడు. ఇది కనుక క్లిక్ అయితే టాలీవుడ్ అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం.
This post was last modified on November 30, 2024 11:51 am
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…