అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన పుష్ప-2 `దిరూలర్` క్యాప్షన్‌తో డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగావిడుదల కానున్న సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చారు నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే పెద్ద ఎత్తున టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని నెలల కిందట అల్లు అర్జున బర్త్ డే సందర్భంగా విడుదల చేసి ఆరు సెకన్ల షార్ట్ టీజర్.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక, ఇటీవల విడుదల చేసిన ఫుల్ లెంగ్ద్ టీజర్ మరింతగా సినిమాపై అంచనాలు పెంచింది.
ఇక, శ్రీలలతో చేసిన ఐటం సాంగ్ `కిసిక్` పాట కూడా నెమ్మది నెమ్మదిగా మాస్‌లోకి వెళ్తోంది. ఇక, ఈ సిని మా ప్రమోషన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. బిహార్ రాజధాని పట్నాలో కొన్ని రోజుల కిందట ప్రారంభించిన ఈ ప్రమోషన్.. తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానుల మనసు దోచుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టికెట్ల విక్రయాలు అయిపోయాయని కూడా ఒక టాక్.ఈ నేపథ్యంలో ఎవరు ఎక్కడ ఈ సినిమా చూసినా ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా.. ఓ యాప్‌ను తీసుకువచ్చారు.
ఈ విషయాన్ని పుష్ప-2 ప్రమోషన్‌లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 12000 స్క్రీన్స్‌పై పుష్ప 2ను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. భాషా సౌలభ్యం కోసం.. `సినీ డబ్స్` అనే యాప్‌ను తీసుకువచ్చామన్నారు. ఈ యాప్‌ద్వారా ఎంపిక చేసి ఆరు భాషల్లో ఏ భాషను ప్రేక్షకులు ఇష్టపడితే దానిలోనే ఈ సినిమాను వీక్షించవచ్చని చెప్పారు. తద్వారా భాషా పరమైన ఇబ్బందులు కూడా లేకుండా.. సినిమాను ఆస్వాదించే అవకాశం కల్పించామన్నారు. సో.. మొత్తానికి ఇప్పటికే.. అన్ని హంగుల పరంగా ప్రేక్షకులను కట్టి పడేస్తున్న పుష్ప-2 ఇప్పుడు మరింతగా మనసులు దోచుకోనుంది.
This post was last modified on November 30, 2024 9:34 pm
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా నందమూరి బాలకృష్ణ చిత్రాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే…