సాధారణంగా సినిమాలను చూడాలని అనుకునేవారు.. సినిమా హాళ్లకు వెళ్లి వీక్షిస్తారు. లేదా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాంలు వచ్చిన తర్వాత.. ఇళ్లలోనే చూస్తున్నారు. అయితే..ఇది సాధారణ ప్రజలకు సౌల భ్యంగా ఉండే అవకాశం. కానీ,నిరంతరం ప్రభుత్వ పనులతో బిజీగా ఉండే ఐఏఎస్ అధికారులకు క్షణం తీరిక ఉండదు. ఎంత ఐఏఎస్ అధికారులైనా..వారికి కూడా కుటుంబాలు ఉంటాయి కాబట్టి.. వారిని కూడా సంతోష పెట్టాలికదా! దీంతో వారి ఆనందం కోసమైనా సినిమాలకు రావాల్సి ఉంటుంది.
కానీ, భద్రతా పరమైన చిక్కులు, సోషల్ మీడియా ప్రభావం .. ఇలా అనేక అంశాలు ఐఏఎస్‌లపైనా ప్రభావం చూపుతున్నాయి. దీంతో వారు గోప్యతను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు నేరుగా సినిమా హాళ్లకు వచ్చి వీక్షించే అవకాశం, సమయం రెండూ కనిపించడం లేదు. ఈ క్రమంలో విజయవాడలో ఐఏఎస్ అధికారుల సంఘం ఓ మిని సినిమాహాలును నిర్మించుకుంది. దీనిలో 48 మంది కూర్చుని హాయిగా సినిమాను వీక్షించే ఏర్పాట్లు చేశారు.
వీకెండ్లలో తమ తమకుటుంబాలతో ఐఏఎస్ అధికారులు ఈ సినిమా హాలుకు వచ్చి మూవీలను వీక్షించే లా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఏపీ ఫిల్మ్ ఛాంబర్‌కు ఓ రిక్వెస్టు పంపించారు. “మీరు మాకు సహకరించాలి. కొత్తగా విడుదలయ్యే సినిమాలను మేం నిర్మించుకున్న మిని సినిమా థియేటర్‌లో ప్రదర్శించే ఏర్పాటు చేయాలి“ అని కోరారు. అయితే.. ఈ సినిమాలను తమకుఉచితంగా ప్రదర్శించాలని వారు కోరడం గమనార్హం. వారాంతపు సెలవుల్లో తమకుటుంబాలతో సహా ఆయా సినిమాలు వీక్షించేలా సహకరించాలని అభ్యర్థించారు. మరి దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్నయం తీసుకుంటుందో చూడాలి.
సహజంగానే ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నతస్థాయి అధికారులకు కాంప్లిమెంటరీ పాస్‌లు ఇస్తారు. అంటే..వారికి సాధారణ సినిమా హాళ్లలోనే ఉచితంగాఎంట్రీ ఉంటుంది. కానీ, వారు ప్రత్యేకంగా నిర్మించుకున్న మినీ థియేటర్‌లో ప్రదర్శించాలని కోరుతున్నారు కాబట్టి ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
This post was last modified on November 30, 2024 11:38 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…