అక్టోబరు 23.. ప్రభాస్ అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ప్రభాస్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈసారి పుట్టిన రోజు వచ్చే ముందు ప్రభాస్ ఒకటికి మూడు చిత్రాలను చేతిలో పెట్టుకుని ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. మరోవైపు నాగ్ అశ్విన్ చిత్రంతో పాటు ఆదిపురుష్‌ను కూడా అనౌన్స్ చేశాడు. దీంతో ఈ చిత్రాల నుంచి ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఏ కానుకలు అందుతాయో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మిగతా రెండు చిత్రాల సంగతేమో కానీ.. నాగ్ అశ్విన్ సినిమా నుంచి మాత్రం పుట్టిన రోజు ముంగిట ఒక కిల్లర్ అప్ డేట్ ఉంటుందట. ట్విట్టర్లో ఒక ప్రభాస్ ఫ్యాన్.. పుట్టిన రోజుకు ఏమైనా అప్ డేట్ ఇస్తున్నారా అని అడిగితే నాగ్ అశ్విన్ ఆసక్తికర రీతిలో బదులిచ్చాడు.
కరోనా వల్ల ప్రభాస్‌తో తాను చేయబోయే చిత్రం షూటింగ్ మొదలవడానికి చాలా సమయం పట్టేలా ఉందని.. ఐతే ప్రభాస్ పుట్టిన రోజు ముందు ఒక కిల్లర్ అప్ డేట్ మాత్రం ఇస్తామని అన్నాడు. మరి ఆ అప్ డేట్ ఏమై ఉంటుందన్నది ఆసక్తికరం. మరోవైపు రాధేశ్యామ్ చిత్రీకరణ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం నుంచి టీజర్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు కాబట్టి.. ప్రమోషన్ల పరంగా తర్వాతి విశేషం టీజరే కావాలి.
ఇంకోవైపు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి కూడా ఏదైనా అప్ డేట్ ఉండొచ్చంటున్నారు. ప్రభాస్ రాముడిగా చేస్తున్న ఈ చిత్రంలో అతడి పక్కన సీతగా కనిపించే నటి ఎవరో ఆ రోజు రివీల్ చేస్తారంటున్నారు. ప్రి లుక్ లాంటిది రిలీజ్ చేసే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం.
This post was last modified on October 7, 2020 9:33 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…