Movie News

ద‌ర్శ‌కుడిగా దళపతి కొడుకు… ఇదెక్కడి మాస్ అయ్యా…

ఓ కొత్త సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌న‌పుడు.. అందులో స్టార్ హీరో న‌టిస్తుంటే ఆ హీరోకు కెరీర్లో అది ఎన్న‌వ సినిమానో చూసి దాన్నే వ‌ర్కింగ్ టైటిల్‌గా పెట్ట‌డం ఇప్పుడు మామూలు అయిపోయింది. కొన్నిసార్లు స్టార్ డైరెక్ట‌ర్ల సినిమాల‌కు కూడా దీన్ని ఫాలో అవుతుంటారు. ఎవ‌రైనా పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న వారసుడు కొత్త‌గా హీరోగా ప‌రిచ‌యం అవుతుంటే.. వాళ్ల పేరు ప‌క్క‌న 1 పెట్టి దాన్నే వ‌ర్కింగ్ టైటిల్‌గానే పెడుతుంటారు. కానీ ఒక ద‌ర్శ‌కుడి తొలి చిత్రానికి త‌న పేరు, 1 నంబ‌ర్ క‌లిపి వ‌ర్కింగ్ టైటిల్ పెట్ట‌డం ఇప్ప‌టిదాకా ఎన్న‌డూ జ‌రిగి ఉండ‌క‌పోవ‌చ్చు.

కానీ త‌మిళ‌నాట తొలిసారిగా ఇలా జ‌రిగింది. జేస‌న్ సంజ‌య్ 1 అంటూ కొత్త చిత్రానికి టైటిల్ పెట్టారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ లీడ్ రోల్ చేస్తున్నారు. త‌మిళంలోనూ మంచి ఫాలోయింగే ఉన్న సందీప్ పేరుతో టైటిల్ పెడితే ఓకే కానీ.. ఇలా ద‌ర్శ‌కుడి పేరును వ‌ర్కింగ్ టైటిల్లో వాడ‌డం చాలా స్పెష‌లే.ఇంత‌కీ ఈ ద‌ర్శ‌కుడు ఎవ‌రీ జేస‌న్ సంజ‌య్ అంటారా? అత‌ను ప్ర‌స్తుతం త‌మిళంలో నంబ‌ర్ వ‌న్ హీరో అన‌ద‌గ్గ విజ‌య్ కొడుకు. తండ్రి బాట‌లో జేస‌న్ సంజ‌య్ హీరో అవుతాడ‌నుకుంటే.. అత‌నేమో మెగా ఫోన్ ప‌ట్టేస్తున్నాడు. రాజ‌కీయాల్లో బిజీ కాబోతూ చివ‌ర‌గా ఓ సినిమా చేస్తున్న విజ‌య్, సినీ రంగానికి త్వ‌ర‌లో టాటా చెప్ప‌బోతున్న స‌మ‌యంలో జేస‌న్ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం.

అత‌డి తొలి చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. క‌త్తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో లైకా సంస్థ‌ను నిల‌బెట్టిన హీరో విజ‌య్. ఆ కృత‌జ్ఞ‌త‌తోనే త‌న కొడుకు డైరెక్ట్ చేయ‌బోయే సినిమాను ప్రొడ్యూస్ చేస్తోందేమో. ఈ సినిమా ప్రి టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గానే క‌నిపిస్తోంది. జేస‌న్ క‌మ‌ర్షియల్ స్ట‌యిల్లో కాకుండా కంటెంట్ ఉన్న సినిమానే చేస్తున్న‌ట్లున్నాడు. ఈ చిత్రానికి పేరున్న టెక్నీషియ‌న్లే ప‌ని చేస్తున్నారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌రి విజ‌య్ వార‌సుడు ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నంలో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

This post was last modified on November 30, 2024 7:00 am

Share

Recent Posts

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

7 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

1 hour ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

3 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

4 hours ago