టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జోసెఫ్ ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న సమంత తన తండ్రి మరణ వార్త తెలియగానే హూటాహుటిన చెన్నై బయలుదేరింది.
తన తండ్రి మరణించిన విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ‘ మళ్లీ నిన్ను కలిసే దాకా నాన్నా…’ అంటూ సమంత హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో, సమంతకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో సానుభూతి తెలియజేస్తున్నారు.
సిటాడెల్ ప్రమోషన్స్ సందర్భంగా సమంత తన తండ్రి గురించి సమంత ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఆయన తన జీవితాన్ని ఛాలెంజింగ్ గా మలిచేవారని సామ్ గుర్తు చేసుకుంది. చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదని, స్మార్ట్, ఇంటెలిజెంట్ అని ఎప్పుడూ భావించకు అని తనకు చెప్పేవారని సామ్ షేర్ చేసుకుంది. తనకున్న సామర్ధ్యాలను ఆయన దాచే ప్రయత్నం చేసేవారని, అప్పుడే మరింత కష్టపడేతత్వం అలవడుతుందని ఆయన నమ్మేవారని సామ్ చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates