శోభిత పెళ్లి కూతురాయెనే..అక్కినేని కుటుంబంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగచైతన్య, శోభిత పెళ్లికి ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా వివాహం జరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే పెద్ద వారి ఇళ్లలో పెళ్లి వేడుకలు ఒకట్రెండు రోజులకు పరిమితం కావు. వారం ముందు నుంచే వేడుకలు మొదలవుతాయి.
అక్కినేని వారు కూడా ఈ పెళ్లిని అలాగే జరిపిస్తున్నారు. శోభితకు మంగళస్నానం చేయించి పెళ్లి కూతురిని చేసే ప్రక్రియ మొదలైపోయింది. శోభిత మంగళస్నానం ఫొటోలు సోషల్ మీడియాలోకి కూడా వచ్చేశాయి. శోభిత పక్కనే నాగచైతన్య కూడా ఉన్నాడు ఫొటోల్లో. వచ్చే నాలుగైదు రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. డిసెంబరు 4న బ్రాహ్మణ పద్ధతిలో 8 గంటల పాటు పెళ్లి వేడుక జరగనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి జరగనుంది. అక్కినేని కాంస్య విగ్రహం ముందు వివాహ వేడుక జరిపించనున్నారు.
చైతూ-శోభిత పెళ్లిని డాక్యుమెంటరీగా తీయబోతున్నట్లు కూడా వార్తలు రావడం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఈ హక్కులను రూ.50 కోట్ల భారీ రేటు పెట్టి కొనుక్కున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలని, వీటిల్లో నిజం లేదు అని స్వయంగా నాగ చైతన్య తెలియజేసారు.
This post was last modified on November 29, 2024 4:07 pm
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…