బాలీవుడ్‌లో ప్రముఖ దంపతులుగా పేరుగాంచిన శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా జంట ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. అయితే, ఈసారి వారి విలాసవంతమైన జీవనశైలి కాదు, ఆస్తుల లెక్కలతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం వీరి ఆస్తుల విలువ దాదాపు రూ. 3,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీనితో పాటు, ఇటీవల జరిగిన ఈడీ దాడులు వీరి పేరును మరింత హాట్ టాపిక్‌గా మార్చేశాయి.
ఇటీవల మనీ లాండరింగ్ కేసులో ఈడీ వీరి నివాసాలపై దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ముంబై, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 15 ప్రదేశాల్లో దాడులు జరిగాయి. అశ్లీల చిత్రాల పంపిణీ కేసులో రాజ్ కుంద్రాపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ వివాదాలు వీరి హోదాకు చెడు పేరు తెచ్చినప్పటికీ, శిల్పా మాత్రం వాటిని నిర్ధాక్షిణ్యంగా తిప్పికొట్టారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతుల దగ్గర రూ. 3,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో అరేబియా సముద్ర తీరాన ఉన్న రూ. 100 కోట్ల విలువైన బంగ్లా వీరి జీవనశైలికి అద్దం పడుతుంది.
అంతేకాదు, పూణేలో మరో విలాసవంతమైన నివాసం కూడా వీరి సొంతం. లగ్జరీ కార్ల జాబితాలో బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, లంబోర్ఘిని అవెంటడార్, BMW X5 వంటి కార్లు ఉన్నాయి. ప్రైవేట్ జెట్ సౌకర్యం ఈ జంటకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఇది ఒక లగ్జరీ స్టూడియో అపార్ట్‌మెంట్‌ను తలపిస్తుంది. షూటింగ్‌లు, వ్యక్తిగత ప్రయాణాల కోసం ఈ జెట్‌ను తరచూ ఉపయోగిస్తున్నారు. ఈ విలాసవంతమైన జీవనశైలి వీరిని బీ-టౌన్‌లో ప్రత్యేకంగా నిలిపింది.
రాజ్ కుంద్రా దాదాపు రూ. 2,800 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తన సంపదను పెంచుకున్నారు. ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు సహ యజమానిగా ఉండటంతో పాటు, స్టీల్, రియల్ ఎస్టేట్, ఫారెక్స్ ట్రేడింగ్‌లలో విస్తృతంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక నటిగా, టీవీ షోల ద్వారా శిల్పా శెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. దాదాపు రూ. 150 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్న శిల్పా ఇప్పటికీ బాలీవుడ్‌లో ప్రముఖంగా ఉన్నారు.
This post was last modified on November 29, 2024 4:00 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…