కీర్తి సురేష్ పెళ్లి గురించి గతంలోనూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె ఖండించింది. కొన్ని రోజుల కిందట మరోసారి ఆమె వివాహం గురించి ప్రచారం మొదలైతే.. కీర్తి మరోసారి వాటిని ఖండించడం మామూలేలే అని చాలామంది లైట్ తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ బాలీవుడ్లోనూ ఓ సినిమాలో నటించి.. కెరీర్ పీక్స్‌లో ఉండగా కీర్తి ఇప్పుడు పెళ్లెందుకు చేసుకుంటుందిలే అనుకున్నారు అందరూ. కానీ ఈసారి వచ్చింది జస్ట్ రూమర్ కాదని.. నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతందని తేలిపోయింది. కీర్తి తండ్రి సురేషే స్వయంగా పెళ్లి గురించి ధ్రువీకరించాడు.
ఇప్పుడు కీర్తి కూడా ఓపెన్ అయిపోయింది. తనకు కాబోయే వరుడు ఆంటోనీతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమది 15 ఏళ్ల బంధం అని ఆమె కామెంట్ చేయడం తెలిసిందే.ఇప్పుడు కీర్తి స్వయంగా తన పెళ్లి కబురును తన నోటి వెంట చెప్పేసింది. శుక్రవారం కార్తి తన తల్లిదండ్రులు మేనక, సురేష్‌లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శనం పూర్తయ్యాక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎందుకు తిరుమల వచ్చిందో వెల్లడించింది. ‘‘వచ్చే నెల నా పెళ్లండీ. అందుకే వచ్చాను’’ అని కీర్తి సిగ్గులొలుకుతూ చెప్పింది. పెళ్లి ఎక్కడ అని అడిగితే గోవా అని మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసింది.
త్వరలో తన తొలి బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్’ రిలీజవుతుండడం పట్ల ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మొత్తానికి ఈసారి మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం నిజమే అన్నమాట. కీర్తి వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. ఈ వయసులో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం సహజమే కానీ.. కీర్తి కెరీర్ ప్రస్తుతం మామూలు ఊపులో లేదు. అయినా ఆమె తన స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఆంటోనీ.. కీర్తి కుటుంబానికి సన్నిహితుడైన ఒక వ్యాపార వేత్త.
This post was last modified on November 29, 2024 3:25 pm
కడప ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి, వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోప ణలు ఎదుర్కొంటున్న వైఎస్…
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు…
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలి ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే.…
ఇది పురుషాధిక్య సమాజం. నిజ జీవితంలోనే కాదు సినిమాల్లోనూ అదే కనిపిస్తుంది. అందుకే మార్కెట్, బిజినెస్ లెక్కలు హీరో మీద…
అదానీతో విద్యుత్ ఒప్పందం, లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం రాష్ట్ర…
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై వైఎస్ జగన్ హయాంలో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు…