సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నేళ్లలో వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొందో తెలిసిందే. ఆమె జర్నీని చూసిన ఎవ్వరైనా తనో ఫైటర్ అని అంగీకరిస్తారు. తన వ్యక్తిత్వంతో ఎందరికో స్ఫూర్తి నిస్తున్న సమంత గురించి క్లాస్ రూంల్లో పాఠాలు చెప్పి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతుండడం విశేషం. ఎక్కడ ఏంటి అన్న వివరాలు తెలియలేదు కానీ.. ట్విట్టర్లో ఒక నెటిజన్ తమ పాథాలజీ క్లాసులో సమంత టాపిక్ వచ్చిందని.. ఆటో ఇమ్యూనిటీ చాప్టర్ గురించి చెబుతూ సమంత గురించి చెప్పారని వెల్లడిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘‘వేరొకరి అజ్ఞానం, ద్వేషం, డ్రామా, నెగెటివిటీ మన మీద ప్రభావం చూపించి, మనల్ని అత్యుత్తమ వ్యక్తులు కాకుండా ఆపే అవకాశం ఇవ్వకండి’’ అంటూ సమంత చెప్పిన ఒక కోట్‌ను ఇక్కడ డిస్ ప్లే చేస్తూ లెక్చరర్ ఈ పాఠం చెప్పడం విశేషం.
సమంత కెరీర్లో తొలి పదేళ్లు అద్భుతంగా గడిచాయి. ‘ఏమా మాయ చేసావె’ సినిమాతో ఆమె కెరీర్ ఒకేసారి పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. పదేళ్ల పాటు ఎన్నో భారీ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా సామ్ ఒక వెలుగు వెలిగింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితం కూడా గొప్పగా సాగుతున్నట్లే కనిపించింది. కానీ చైతూ నుంచి విడిపోవడం.. అదే సమయంలో మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడడం.. సినిమా అవకాశాలు తగ్గిపోవడం.. ఇలా సమంత జీవితం తల్లకిందులైంది. గత కొన్నేళ్లలో శారీరకంగా, మానసికంగా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ అన్ని సమస్యలనూ అధిగమించి ఇప్పుడు మళ్లీ కెరీర్లో ముందుకు సాగుతోంది. ఇప్పుడు తాను కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా, ఆరోగ్య పరంగా ఉత్తమ స్థితిలో ఉన్నట్లు సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఇటీవలే ఆమె ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
This post was last modified on November 29, 2024 12:21 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…