మనకు సంక్రాంతి ఎంత కీలకమో అదే పండగను పొంగల్ గా వ్యవహరించే కోలీవుడ్ కు కూడా అంతే ముఖ్యం. అందుకే స్టార్ హీరోల సినిమాలు ఈ టైంలో రిలీజ్ చేస్తే ఎంత యావరేజ్ ఉన్నా సరే రికార్డులు సృష్టించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వీలైనంత వరకు నిర్మాతలు ఈ ఛాన్స్ వదులుకోవడానికి ఇష్టపడరు. మైత్రి మూవీ మేకర్స్ కూడా అదే ప్లాన్ తోనే అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీని జనవరి పది రిలీజ్ చేసేందుకు ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అజిత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీగా దీని మీద ఇతర భాషల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.
కట్ చేస్తే నిన్న రాత్రి హఠాత్తుగా అజిత్ మరో మూవీ విదాముయార్చి టీజర్ ని వదిలింది లైకా సంస్థ. అందులో స్పష్టంగా పొంగల్ రిలీజని పేర్కొనడంతో మైత్రి వర్గాలు షాక్ తిన్నాయి. నిజానికీ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. దసరా, దీపావళికు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇండియన్ 2 ఇచ్చిన స్ట్రోక్ కి వాయిదా వేసుకున్నారు. దానికి తోడు షూటింగ్ మధ్యలో అజిత్ పలుమార్లు గాయాల పాలు కావడంతో పోస్టు పోన్లు తప్పలేదు. ఇప్పుడు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ చెప్పా పెట్టకుండా టీజర్ వదిలింది. నిమిషంన్నర వీడియోలో కథను చెప్పలేదు కానీ కీలక విజువల్స్ చూపించారు.
ఇదో యాక్షన్ డ్రామానే క్లారిటీ అయితే వచ్చింది. తమిళం నుంచి పొంగల్ కు చెప్పుకోదగ్గ సినిమా ప్రస్తుతానికి విక్రమ్ వీరధీర శూరన్ ఒక్కటే. దీనికి విదాముయార్చి తోడయ్యింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఉన్నప్పటికీ కోలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకిచ్చే ప్రాధాన్యం తెలిసిందే కాబట్టి ఎక్కువ ఆశించలేం కానీ ఇప్పుడు లైకా ఇచ్చిన ట్విస్టుకు మైత్రి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ రెండు అజిత్ సినిమాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఇండస్ట్రీలో లేకపోలేదు. గతంలో నాని (జెండాపై కపిరాజు – ఎవడే సుబ్రహ్మణ్యం), బాలకృష్ణ (బంగారు బుల్లోడు – నిప్పురవ్వ) ఒకే రోజు రెండు రిలీజులతో వచ్చారు.
This post was last modified on November 29, 2024 10:35 am
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…