చియాన్ విక్రమ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అపరిచితుడు తర్వాత టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న ఈ విలక్షణ నటుడు ఆ తర్వాత వరస ఫ్లాపులతో దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ అతను పడే కష్టానికి విపరీతమైన అభిమానం చూపించే వాళ్ళు ఏపీ, తెలంగాణలో బోలెడున్నారు. పొన్నియిన్ సెల్వన్ కు మన దగ్గర క్రేజ్ రావడంలో మణిరత్నం బ్రాండ్ కన్నా ముందు పని చేసింది విక్రమ్ పేరే. తంగలాన్ ఫ్లాప్ అయినా సరే మొదటి నాలుగైదు రోజు డీసెంట్ వసూళ్లు దక్కాయంటే విక్రమ్ మీద గౌరవంతో చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి.
ఇక అసలు విషయానికి వస్తే విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ తెలుగు ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని లేటెస్ట్ అప్డేట్. తొలుత మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు ఉంటుందని టాక్ వచ్చింది. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడమో మరే ఇతర కారణమో కానీ ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త దర్శకుడు దీపక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మనసాయనమః షార్ట్ ఫిలింతో ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న దీపక్ కు ఇది డెబ్యూ. అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాధమిక దశలో దీనికి సంబంధించిన అంగీకారం జరిగిపోయిందని సమాచారం.
తెలుగు తమిళం రెండు భాషల్లో సమాంతరంగా షూట్ చేస్తారని తెలిసింది. ఇటీవలి కాలంలో పక్క రాష్ట్రాల హీరోలు టాలీవుడ్ మీద కన్నేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తనకంటూ మార్కెట్ సృష్టించుకోగా సార్ తో ధనుష్ మొదటి మెట్టు విజయవంతంగా ఎక్కాడు. వీళ్ళందరూ లేట్ గా ఎంట్రీ ఇచ్చినవాళ్లు. కానీ ధృవ్ తెలివిగా ముందే అడుగులు వేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకొద్దిరోజులు వెయిట్ చేయాలి. మహాన్ లో తండ్రితో కలిసి నటించి మెప్పించిన ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బైసన్ అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
This post was last modified on November 29, 2024 9:05 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…