పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి మహారాజ ఈ రోజు చైనాలో విడుదలయ్యింది. సుమారు 40 వేల స్క్రీన్లలో ఇంత పెద్ద మొత్తంలో ఒక కోలీవుడ్ మూవీ వెళ్లడం ఇదే మొదటిసారి. మూడు రోజుల క్రితం ప్రీమియర్లు వేస్తే అక్కడి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రిపోర్ట్స్ వచ్చాయి. కూతురికి దుస్థితి కలిగించిన దుర్మార్గుడి అంతం చూసేందుకు ఒక తండ్రి చేసే పోరాటానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. పరిమిత షోలే అయినా మొత్తం హౌస్ ఫుల్స్ కావడం గమనార్హం. ఇవాళ్టి టికెట్ల అమ్మకాలు లక్ష దాటాయట.
సాధారణంగా చైనా జనాలు ఎమోషనల్ కథలను బాగా ఆదరిస్తారు. గ్రాఫిక్స్, ఏఐ లాంటి టెక్నాలిజీలు వాళ్లకు కొత్త కాదు కాబట్టి అలాంటివి వస్తే హిట్ చేస్తారు తప్పించి బ్లాక్ బస్టర్ కానివ్వరు. అందుకే అమీర్ ఖాన్ దంగల్ ఇప్పటికీ టాప్ 1 ప్లేస్ లో ఉంది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ను నెత్తినబెట్టుకున్నారు కానీ చైనాలో కాదు. దీన్ని బట్టే భావోద్వేగాలకు చైనీయులు ఎంత పెద్ద పీఠ వేస్తారో అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర జస్ట్ హిట్ అనిపించుకన్నా సీక్రెట్ సూపర్ స్టార్ అక్కడ రికార్డులు సృష్టించింది. సో మహారాజ పేరిట కొత్త రికార్డులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అంతర్జాతీయ ట్రేడ్ టాక్.
స్పెషల్ షోల నుంచే అయిదు కోట్ల దాకా వచ్చాయంటే లాంగ్ రన్ లో మహారాజ కొత్త మైలురాళ్ళు సృష్టించడం ఖాయం. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కం ఫ్యామిలీ థ్రిల్లర్ లో ఊహించని ట్విస్టులు విజయానికి కారణమయ్యాయి. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న మహారాజ చైనాలో స్ట్రీమింగ్ కావడం లేదు. ఎందుకంటే ఈ ఓటిటికి అక్కడ అనుమతి లేదు కాబట్టి. పైరసీలో చూసే ఛాన్స్ కూడా లేదు. కఠిన చట్టాలు, ఇంటర్ నెట్ మీద ప్రభుత్వ నియంత్రణ లాంటి కారణాలు చైనాలోని థియేటర్ వ్యవస్థను బలంగా ఉంచుతున్నాయి. మనకూ అలా జరిగితే బాగుండు కదా.
This post was last modified on November 29, 2024 8:54 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…