చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ లేని కొరతను తీరుస్తూ రజనీకాంత్ కు జైలర్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. ఎప్పుడో మార్కెట్ పడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో సైతం నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం మాటలు కాదు. తలైవర్ మ్యానరిజం, అనిరుద్ రవిచందర్ సంగీతం, సీనియర్ స్టార్ల క్యామియోలు ఒకటా రెండా ఎన్నో ఆకర్షణలు సినిమాకు రిపీట్ రన్ తీసుకొచ్చాయి. తర్వాత లాల్ సలాంతో డిజాస్టర్ అందుకున్న రజని ఇటీవలే వేట్టయన్ రూపంలో ఆశించిన ఫలితం అందుకోలేదు. అందుకే లోకేష్ కనగరాజ్ కూలి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మరో కిక్కిచ్చే న్యూస్ ఫ్యాన్స్ కోసం వచ్చింది.
జైలర్ 2 కోసం రంగం సిద్ధమవుతోందని చెన్నై అప్డేట్. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోని డిసెంబర్ 2న షూట్ చేసి రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12 ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దానికి తగ్గట్టే సన్ నెట్ వర్క్ తమ నెట్ వర్క్ హ్యాండిల్స్ జైలర్ మొదటి భాగానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మెమోరీస్ ని తవ్వి తీస్తోంది. జైలర్ 2 స్క్రిప్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇటీవలే పూర్తి చేశాడు. ధనుష్ కూడా ఇందులో ఉంటాడనే ప్రచారం జోరుగా ఉంది కానీ కూతురికి విడాకులు ఇచ్చిన అల్లుడితో మావయ్య నటిస్తాడా లేదా అనే దాని మీద ఇంకా సందేహాలు తొలగిపోలేదు.
ఫస్ట్ పార్ట్ లాగే జైలర్ 2 ని వేగవంతంగా పూర్తి చేయబోతున్నారు. అయితే ఇందులో ఏం చూపిస్తారనే డౌట్ రావడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ముత్తువేల్ పాండియన్ ఫ్లాష్ బ్యాక్ ని ఎక్కువగా చూపిస్తారని తెలిసింది. జైలర్ 1లో కేవలం జైలు ఎపిసోడ్లకు పరిమితమైన యంగ్ లుక్ ని ఈసారి పూర్తి స్థాయిలో వాడబోతున్నారట. కొడుకు, విలన్ ఇద్దరూ చనిపోయారు కాబట్టి ఈసారి కొత్త ప్రతినాయకుడు కావాలి. దానికోసం క్రేజీ బాలీవుడ్ నటుడిని సెట్ చేస్తారని అంటున్నారు. అనౌన్స్ మెంట్ రాకుండానే జైలర్ 2 మీద ఇంత ఆసక్తి రేగుతోందంటే సెట్స్ పైకి వెళ్లి అప్డేట్స్ వచ్చాక ఇంకెంత రచ్చ జరుగుతుందో.
This post was last modified on November 28, 2024 5:23 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…