Movie News

డాన్సుల్లో అరాచకం చూస్తారు : బన్నీ హామీ

పుష్ప 2 ది రూల్ ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలో అడుగు పెట్టిన అల్లు అర్జున్ బృందానికి ఘన స్వాగతం లభించింది. కోచి ఎయిర్ పోర్ట్ లో అభిమాన సందోహం చూసి అక్కడి స్టాఫ్ నోరెళ్లబెట్టారంటే అతిశయోక్తి కాదు. ఫ్యాన్స్ అరుపులకు కారు ఎక్కబోతున్న బన్నీ చెవులు మూసుకునే దాకా పరిస్థితి వచ్చిందంటే ఐకాన్ స్టార్ యుఫోరియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాట్నా, చెన్నై తరహాలోనే ఇక్కడా విపరీతమైన స్పందన కనిపించడం నిర్వాహకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆర్య నుంచే బన్నీకి కేరళలో ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పడి ప్రతి సినిమాకు అది అంతకంతా పెరుగుతూ పోయింది.

ఇంత అభిమానం ఇచ్చిన మల్లువుడ్ ప్రేక్షకులకు బన్నీ కొన్ని సర్ప్రైజులు ఇచ్చాడు. వాటిలో మొదటిది పీలింగ్స్ అనే త్వరలో విడుదల కాబోయే పాట. సినిమా ఆరు భాషల్లో విడుదలవుతున్నప్పటికీ తొలి భాగంలో వచ్చే లిరిక్స్ అన్ని వెర్షన్లలో మలయాళంలోనే వినిపిస్తాయని, ఇది దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి తాను ప్రత్యేకంగా ఇక్కడి అభిమానుల కోసం చేయించిన కానుకని చెప్పడంతో స్టేడియం చప్పట్లలో మారుమ్రోగిపోయింది. అంతేకాదు పుష్ప 1లో పెద్దగా డాన్స్ చేసే అవకాశం రాకపోవడం వెలితిగా ఉండేదని, ఇందులో మాత్రం పాత అల్లు అర్జున్ ని చూస్తారని ఊరించడం మాములుగా పేలలేదు.

సాంగ్ లో కొంత శాంపిల్ ని స్టేజి మీదే ప్లే చేయించిన అల్లు అర్జున్ ఈ పాట చూశాక రష్మికని ఇకపై క్రష్ మిక అని పిలుస్తారని చెప్పడం చూస్తే అవుట్ ఫుట్ ఏ రేంజ్ లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయిదు సంవత్సరాలుగా పుష్ప మీదే పని చేస్తున్న బన్నీ రేంజు డాన్సుల కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగానే దర్శకుడు సుకుమార్ తన మార్కు నృత్యాలను జోడించినట్టు కనిపించింది. నిన్నటిదాకా కిస్ కిస్సిక్కు దెబ్బలు పడతాయి గురించే జరిగిన చర్చ తాజాగా పీలింగ్స్ వైపు షిఫ్ట్ అయ్యేలా ఉంది. వినిపించింది కొన్ని సెకండ్లే అయినా ప్రభావం అలా ఉంది.

This post was last modified on November 28, 2024 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిప్యూటీ సీఎం పదవికి ఓకే చెప్పిన షిండే!

మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు…

2 hours ago

లోకేశ్ కి రుణపడ్డానంటోన్న డ్రైవర్ లోవరాజు!

ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి…

3 hours ago

పెళ్లి ఫోటోస్ :- నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల వైభవమైన వివాహం!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈరోజు ఓ ఇంటివాడయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న శోభిత ధూళిపాలతో ఈరోజు ఏడడుగులు నడిచాడు.…

3 hours ago

పుష్ప 2 ప్రమోషన్ల కోసం ప్రాణం పెట్టిన శ్రీవల్లి!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…

5 hours ago

`సీజ్ ది షిప్‌`: తెలుగు సినిమా టైటిల్ రిజిస్ట్రేష‌న్‌!

`సీజ్ ది షిప్‌` - గ‌త నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్‌` ఇది! ఇటు సోష‌ల్ మీడియాలోనూ.. అటు…

5 hours ago