సినీ ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీలు లేని నటుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. అందుకే ఫాన్స్ అభిమానంగా అతనిని డార్లింగ్ అని పిలుస్తారు. ఆడియన్స్ లోనే కాక సెలబ్రిటీలలో కూడా ప్రభాస్ కి అభిమానులు ఎందరో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి జరీనా వహాబ్ ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వెల్లడించడంతోపాటు కొన్ని వైరల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.
ఓ హిందీ ఛానల్ కు సంబంధించిన ఇంటర్వ్యూ పాల్గొన్న జరీనా.. ప్రభాస్ గురించి ప్రస్తావిస్తూ ఎంతో గొప్పగా మాట్లాడారు. అటువంటి మంచి వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదు అని చెప్పిన జరీనా.. ప్రభాస్ లాంటి వ్యక్తి ఎవరూ లేరు అని పొగిడారు. అంతేకాదు వచ్చే జన్మలో తనకు ఇద్దరు కొడుకులు కావాలని.. ఒకరు తన కొడుకు సురాజ్ కాగా మరొకరు ప్రభాస్ అని పేర్కొన్నారు.
ఒక తల్లి వచ్చే జన్మలో నాకు ప్రభాస్ లాంటి బిడ్డ కావాలి అనడం .. ప్రభాస్ ఎంత గొప్పవాడు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎలా ఉంటారు అనే విషయంపై ఎందరో సెలబ్రిటీలు మాట్లాడారు. ఇక ప్రభాస్ వారికి ఇచ్చే గౌరవం, ఇంటి నుంచి తెప్పించే ప్రత్యేకమైన భోజనం గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెబుతారు.
అదేవిధంగా జరీనా కూడా షూటింగ్ సమయంలో సెట్స్ లో ఎటువంటి అహం అనేది ప్రదర్శించని నటుడిగా ప్రభాస్ ను వర్ణించారు. అంతేకాదు షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కలిసిన ప్రభాస్ వెళ్లిపోయే ముందు అందరికీ బై చెప్పి వెళ్తారట. ప్రభాస్ రోజుకి కనీసం 30- 40 మంది తినే విధంగా భోజనాలు ఇంటి నుంచి తెప్పిస్తారట. అలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ లో గొప్ప క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి.. అతని గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు అంటున్నారు జరీనా. అతనికి మంచి ఆరోగ్యం ,నిండు జీవితం అల్లాహ్ ఇస్తాడని ఆమె పేర్కొన్నారు.
విశాఖలో పుట్టి పెరిగిన అచ్చమైన ఆంధ్ర అమ్మాయి జరీనా వహాబ్…కానీ ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. తెలుగులో పలు చిత్రాలలో నటించిన జరీనా.. తమిళ్, మలయాళం చిత్రాలలో కూడా యాక్ట్ చేశారు. తాజాగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో పెద్ద ఎన్టీఆర్ తల్లి పాత్రను పోషించారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’లో ఆమె ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.
This post was last modified on November 28, 2024 1:51 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…