Movie News

గంభీరుడు కాదు, రాబోయేది వీరుడే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల్లో ఏది ముందు రిలీజనే అయోమయం కొద్దిరోజులుగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. హరిహర వీరమల్లు మార్చి 28 తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ హఠాత్తుగా దాని స్థానంలో ఓజి రావొచ్చనే ప్రచారం కన్ఫ్యూజన్ కి దారి తీసింది. ఫైనల్ గా దీనికి చెక్ పెట్టబోతున్నారు. ఈ నెలాఖరు నుంచి విజయవాడలో హరిహర వీరమల్లు చివరి షెడ్యూల్ ని ఏకధాటిగా తీయబోతున్నారు. రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ ఎత్తున యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. దీని కోసమే పవన్ పొడవాటి హెయిర్ స్టైల్ అలాగే కొనసాగిస్తున్నారు.

ఎలా చూసుకున్నా హరిహర వీరమల్లు రావడమే అన్ని విధాలా రైటు. ఎందుకంటే నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే దీని మీద విపరీతమైన భారాన్ని మోస్తున్నారు. వంద కోట్లకు పైగా పెట్టుబడి దీని మీద పెట్టారు. దర్శకుడు క్రిష్ అధిక శాతం పూర్తి చేశాక బ్యాలన్స్ బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నారు. కీరవాణి ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాల్సి ఉంది. ఫైనల్ కాపీ సిద్ధం కాగానే మొదలుపెడతారు. అమెజాన్ ప్రైమ్ తో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడలేని పరిస్థితి వీరమల్లు డేట్ పలుమార్లు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఓజి కోసమో ఇంకో కారణం కోసమో పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేదని సమాచారం.

సో చెప్పిన ప్రకారం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ రిలీజ్ లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆలస్యం వల్ల హైప్ తగ్గినట్టు అనిపించినా సరైన ప్రమోషన్లతో దాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు సూర్య మూవీస్ టీమ్ ప్రణాళికలు వేస్తోంది. మొత్తం పూర్తయ్యాక ఓజి పబ్లిసిటీకి కాసింత బ్రేక్ ఇవ్వమని డివివి బృందాన్ని కోరతారట. అక్కడి నుంచి వీరమల్లు సందడి మొదలుపెడతారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారిక్ డ్రామా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించాడు. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ ఇది. రెండో భాగం వచ్చే ఏడాదే పూర్తి చేస్తారట.

This post was last modified on November 28, 2024 12:09 pm

Share

Recent Posts

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

16 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

36 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…

3 hours ago

ఎల్లమ్మకు దొరికింది మంచి ఛాయిసే

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…

4 hours ago