సాధారణంగా సినిమా నిడివి రెండున్నర నుంచి మూడు గంటల మధ్యలో ఉండటం ఎప్పటి నుంచో చూస్తున్నదే. ప్రేక్షకులు దీనికే అలవాటు పడ్డారు. ఇంతకన్నా ఎక్కువ ఉంటే అధికశాతం చూసేవాళ్ల ఓపిక మీద ప్రభావం చూపించడంతో పాటు థియేటర్ నిర్వహణ పరంగా కూడా భారం అవుతుంది కాబట్టి దర్శక నిర్మాతలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని లెన్త్ ప్లాన్ చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం దానికి అతీతంగా తాము ఆడియన్స్ కి ఏం ఇవ్వాలని స్క్రిప్ట్ రాసుకున్నారో దాన్ని పూర్తిగా చూపించేవరకు రాజీపడరు. పుష్ప 2 ది రూల్ అదే కోవలోకి చేరబోతోంది. మరి అన్నగారి టాపిక్ ఎందుకు వచ్చిందో చూద్దాం.
టాలీవుడ్ చరిత్రలో అత్యధిక నిడివి కలిగిన సినిమాల్లో మొదటి స్థానం దానవీరశూరకర్ణది. 3 గంటల 44 నిమిషాలతోనూ బ్లాక్ బస్టర్ సాధించింది. ఎన్టీఆర్ నటన, దర్శకత్వానికి జనాలు నీరాజనం పట్టారు. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. తర్వాతి స్థానం లవకుశది. దీని నిడివి 3 గంటల 28 నిముషాలు. ఈ రెండు అన్నగారివే కావడం, ఇండస్ట్రీ రికార్డులు సృష్టించినవి కావడం గమనార్షం. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ మూడో ప్లేస్ తీసుకోబోతోంది. 3 గంటల 21 నిమిషాలతో తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో ఒక అరుదైన ఘనత సాధించనుంది. ఇప్పటి జనరేషన్ స్టార్లలో ఎవరూ తీసుకోని అతి పెద్ద రిస్క్ ఇది.
హిందీలో ఇలాంటివి బోలెడున్నాయి. మేరా నామ్ జోకర్, ఎల్ఓసి కార్గిల్, లగాన్, సంగం, ఖతర్నాక్, హే రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాండంత లిస్టు ఉంది. కానీ తెలుగులో మాత్రం చాలా తక్కువ. ఆర్ఆర్ఆర్ సైతం 3 గంటల 5 నిమిషాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక కమర్షియల్ చిత్రంలో సుకుమార్ ఇంత లెన్త్ పెట్టడం చిన్న విషయం కాదు. రేపు బ్లాక్ బస్టర్ సాధిస్తే ఇతర దర్శకులూ దీన్ని ఫాలో అయ్యే అవకాశం లేకపోలేదు. కత్తెర వేసేందుకు అవకాశం లేకుండా టైటిల్ నుంచి శుభం కార్డు దాకా ఊర మాస్ కంటెంట్ తో పుష్ప 2 ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఖచ్చితంగా అలరిస్తుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు.
This post was last modified on November 28, 2024 12:12 pm
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా నందమూరి బాలకృష్ణ చిత్రాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…