ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్నా బడ్జెట్, విఎఫ్ఎక్స్ లాంటివి ఆలస్యానికి కారణంగా నిలిచేవి కానీ ఇప్పుడలా కాదు. అంచనాల బరువుని మోసే క్రమంలో హీరోలు దర్శకులు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల జాప్యాన్ని నిలువరించడం కష్టమైపోతోంది. పుష్పకూ ఈ సమస్య వచ్చింది. పుష్ప 1 ది రైజ్ మాములు హిట్టయ్యుంటే అల్లు అర్జున్ ఈపాటికి ఇంకో రెండు సినిమాలు చేసేవాడేమో కానీ అది బ్లాక్ బస్టర్ కావడం సీక్వెల్ మీద విపరీతమైన అంచనాలు మోసుకొచ్చింది.
దీంతో స్క్రిప్ట్ మీద సుకుమార్ బృందం ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఫలితం పుష్ప 2 ది రూల్ మూడేళ్ళ నిర్మాణం. ఏదైతేనేం ఎట్టకేలకు డిసెంబర్ 5 విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ కోచిలో జరిగిన ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ అభిమానులను మూడు సంవత్సరాల పాటు వెయిట్ చేయించానని, ఇకపై ఇంత గ్యాప్ రాకుండా చూసుకుంటానని మల్లువుడ్ ఫ్యాన్స్ సాక్షిగా హామీ ఇచ్చేశాడు. మలయాళంలో ఇంత పేరు రావడానికి దర్శకుడు సుకుమారే కారణమని, ఆర్య నుంచి పుష్ప దాకా ఆయనతో చేసిన సినిమాలు తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొన్నాడు.
సో అల్లు అర్జున్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడనే క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి మొదలుపెడతారనే దాని గురించి ఇంకా సమాచారం లేదు కానీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తున్నారు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టు పని మీదే ఉన్నారు. పుష్ప 2కున్న ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే ప్రభాస్ తర్వాత అంతటి స్టార్ డం వచ్చే అవకాశమున్న హీరోగా అల్లు అర్జున్ నిలుస్తాడని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. బ్లాక్ బస్టరైతే అదే జరిగేలా ఉంది.
This post was last modified on November 27, 2024 10:54 pm
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…