బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్ ఉంటుంది కనకే ఒక్కోసారి షూటింగ్ స్లాట్స్ ని వాళ్లకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం శ్రీలీల. సరిగ్గా ఏడాది క్రితం నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ తమకు అతి పెద్ద ఛాలెంజ్ శ్రీలీల కాల్ షీట్లను సంపాదించుకోవడమని, అతి కష్టం మీద తన సహకారంతో పూర్తి చేశామని, ఆ రోజు ఆమె పక్కన లేని విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కట్ చేస్తే ఏడాది గడిచిపోయాక స్టోరీ మారిపోయింది.
ఇవాళ రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో ఇదే ప్రస్తావన మళ్ళీ వచ్చింది. అయితే శ్రీలీల 2024లో ఏ సినిమా ఒప్పుకోకుండా పూర్తి డేట్లు నితిన్ మూవీకే కేటాయించిన విషయాన్ని ప్రత్యేకంగా ఆవిడే నొక్కి చెప్పింది. అంతకు ముందు నితిన్ మాట్లాడుతూ ఈసారి బాగా ఇచ్చిందని, ఎక్స్ ట్రాడినరి టైంలో తానన్న మాటలు గుర్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఒకేసారి గుంటూరు కారం, ఆదికేశవ, భగవంత్ కేసరి, స్కందతో శ్రీలీల ఆ టైంలో ఊపిరి సలపలేనంత బిజీగా ఉంది. ఆ తర్వాత ఎంబిబిఎస్ పరీక్షల కోసం బ్రేక్ తీసుకుంది. తిరిగి పదకొండు నెలల గ్యాప్ తర్వాత రాబిన్ హుడ్ తో డిసెంబర్ 25 నుంచి పలకరించనుంది.
ఒకే నెలలో శ్రీలీల ఇటు పుష్ప 2 ది రూల్ ఐటెం సాంగ్, అటు రాబిన్ హుడ్ లో మెయిన్ హీరోయిన్ గానూ దర్శనమివ్వనుంది. రెండూ బ్లాక్ బస్టర్స్ అవుతాయనే నమ్మకం వ్యక్తం చేస్తుండగా ఒకే బ్యానర్ (మైత్రి) లో ఇవి రూపొందటం గమనార్హం. దీని తర్వాత వచ్చే ఏడాది మే 9న రవితేజ మాస్ జాతరలో సందడి చేయనుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు పునఃప్రారంభమవుతునే క్లారిటీ ఇంకా లేకపోవడంతో ఒక్కసారి షెడ్యూల్ లాకయ్యాక శ్రీలీల డేట్లు తీసుకుంటారు. ఇవి కాకుండా ఇంకేవి ఒప్పుకోలేదు. కొన్ని కథా చర్చల స్టేజిలో ఉన్నాయి. కుర్చీలు మడతపెట్టే బ్లాక్ బస్టర్స్ ఏవి అవుతాయో చూడాలి.
This post was last modified on November 27, 2024 7:41 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…