దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ తర్వాత ఆ స్థాయిలో ఇండియా వైడ్ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజులే సమయం మిగిలుంది. ఐతే ఎప్పట్లాగే సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేయడంతో నిన్నటి వరకు కూడా టీం ఆ పనిలోనే బిజీగా ఉంది. నిన్న మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుంది. వెంటనే రాత్రికే ఎడిటింగ్, మిక్సింగ్ కూడా పూర్తి చేసి.. ఈ రోజు ఫస్ట్ కాపీ తీసేశారు. సెన్సార్ చేయించడానికి మూడు రోజుల నుంచి స్లాట్ తీసుకుంటూనే ఉన్న టీం.. చివరికి ఈ రోజు కాపీ ఇస్తోంది.
ఐతే అక్కడికి కాపీ వెళ్లడానికి ముందే టీంలోని ముఖ్యుల కోసం స్పెషల్ షో వేశారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షో చూడడం విశేషం.అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం పదిన్నర ప్రాంతంలో ‘పుష్ప-2’ షో మొదలైంది. నిడివి ఎక్కువ కావడంతో షో పూర్తయ్యేసరికి 2 గంటలైంది. ఈ షోను టీంతో పాటు అల్లు అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అరవింద్ మూవీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యారట. షో అయ్యాక బన్నీ, సుకుమార్, అల్లు అరవింద్ పరస్పరం కౌగిలించుకున్నారు.
సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అల్లు అరవింద్ అక్కడి నుంచి చాలా సంతోషంగా బయల్దేరినట్లు తెలిసింది. సినిమాలో ప్రతి పావుగంటకూ హైప్ ఇచ్చే ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. టీం అంతా కూడా ఔట్ పుట్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ షో పూర్తయ్యాక సెన్సార్ కోసం కాపీని పంపించారు. ఈ రోజు రాత్రికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేస్తుందని తెలుస్తోంది. డిసెంబరు 5న పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 27, 2024 5:22 pm
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…