నితిన్-రష్మి-వెంకీ కుడుముల కలయికలో వచ్చిన ‘భీష్మ’ అప్పట్లో పెద్ద హిట్టే అయింది. మళ్లీ ఈ కలయికలో సినిమాను అనౌన్స్ చేసినపుడు ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. కానీ ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే దశలో రష్మిక తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. హిట్ కాంబినేషన్లో సినిమా చేయడానికి రష్మికకు ఏం అభ్యంతరం.. ఆమె సినిమా నుంచి తప్పకుందా, తప్పించారా అనే చర్చ జరిగింది. ఐతే రష్మిక ఈ సినిమా నుంచి వైదొలగడంలో ఏ వివాదం లేదని దర్శకుడు వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు. ‘‘మేం ఈ సినిమా అనౌన్స్ చేసే సమయానికి రష్మిక ఓకే చెప్పారు. కానీ షూట్ మొదలయ్యే సమయానికి ఆమె చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఈ సినిమాలో ఆమె భాగం కాలేదు’’ అని వెంకీ క్లారిటీ ఇచ్చాడు.
ఇక ‘రాబిన్ హుడ్’ సినిమా కథ గురించి వెంకీ మాట్లాడుతూ.. ఇదేం పూర్తి కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా ఏమీ కాదని చెప్పాడు. ‘‘ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కానీ కానీ కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. సినిమా మొదలైన 20 నిమిషాల్లోనే కథలో కీలక మలుపు ఉంటుంది. ఆ మలుపు ఏంటన్నది కూడా ట్రైలర్లో చూపిస్తాం’’ అన్నాడు. నితిన్ ఫ్లాపుల్లో ఉన్న సంగతి ప్రస్తావించగా.. ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని, నితిన్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని.. ఇది పక్కా కమర్షియల్ సినిమా అని వెంకీ కుడుముల తెలిపాడు. ‘పుష్ప-2’ నిర్మాతలే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తున్న నేపథ్యంలో ఒకే సంస్థ నుంచి తక్కువ గ్యాప్‌లో రెండు సినిమాలు వస్తే ఇబ్బంది లేదా అని అడిగితే.. రెండు సినిమాలకు మూడు వారాల గ్యాప్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదని.. రెండు సినిమాలూ మంచి వసూళ్లు సాధిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on November 27, 2024 5:11 pm
మాళవిక మోహనన్.. రీసెంట్ గా విడుదలైన తంగలన్ చిత్రంలో యాక్షన్ పాకుడు నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ…
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతని తనకు కాకుండా వేరొకరికి ఇవ్వడం పట్ల దేవిశ్రీ ప్రసాద్…
దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’…
తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ…
తమిళ కథానాయిక త్రిషకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. వర్షం. ఆ సినిమాతో ఒకేసారి ఆమె చాలా మెట్లు…
2019లోనే శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ రుక్మిణి వసంత్ కు బ్రేక్ రావడానికి నాలుగేళ్లు పట్టింది. సప్తసాగరాలు దాటి సైడ్…