తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ మోహిని’ అనే సినిమాలో కలిసి నటించారు. వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. ధనుష్ ప్రొడక్షన్లో వచ్చిన ‘ఎదిరి నీచ్చిల్’ అనే సినిమాలో ఉచితంగా నయన్ ఐటెం సాంగ్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ (పస్తుతం భర్త) విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన ‘నానుం రౌడీ దా’ సినిమాను ధనుషే ప్రొడ్యూస్ చేశాడు. అలాంటి వాళ్లు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. తన లైఫ్ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ద ఫేరీ టేల్’ కోసం ‘నానుం రౌడీ దా’ నుంచి ఫుటేజ్ ఇవ్వడానికి ధనుష్ అంగీకరించలేదని, పైగా 3 సెకన్ల ఫుటేజ్ వాడుకున్నందుకు పది కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని నయన్ ఇటీవల బహిరంగ లేఖలో ధనుష్ మీద విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.
ఐతే ఆ లేఖ గురించి ధనుష్ వెంటనే స్పందించలేదు. తన మీద విమర్శలు వచ్చినా సైలెంట్‌గా ఉన్నాడు. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం నయనతారను ఎటాక్ చేశారు. ఈ వివాదాన్ని ధనుష్‌కు సాగదీయడం ఇష్టం లేక సైలెంటుగా ఉన్ానడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడతను నయనతార మీద దావా వేయడం గమనార్హం. అనుమతి లేకుండా డాక్యుమెంటరీ కోసం ఫుటేజ్ వాడుకున్నందుకు నయన్, విఘ్నేష్ దంపతులతో పాటు వారికి చెందిన ‘రౌడీ పిక్చర్స్’ మీద ధనుష్ కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అంగీకరించింది. మరి విచారణ అనంతరం కోర్టు ఏమంటుందో చూడాలి. మరోవైపు ధనుష్‌ను ఇప్పటికే ఎటాక్ చేస్తున్న నయనతార.. ఇప్పుడు అతను కోర్టు మెట్లు ఎక్కిన నేపథ్యంలో ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం. చూస్తుంటే ఇద్దరి మధ్య పీటముడి మరింత బిగుసుకునేలా కనిపిస్తోంది.
This post was last modified on November 27, 2024 4:58 pm
ఏకంగా 7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను…
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…