తమిళ కథానాయిక త్రిషకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. వర్షం. ఆ సినిమాతో ఒకేసారి ఆమె చాలా మెట్లు ఎక్కేసింది. తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో తెలుగు సినిమాల ప్రస్తావన వస్తే ఆమె ‘వర్షం’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఆ సినిమా తన కెరీర్లో చాలా ప్రత్యేకం అని చెబుతుంది. అంతేకాక ‘వర్షం’ సినిమా వల్ల పడ్డ కష్టాల గురించి కూడా ఏకరవు పెడుతుంది. తాజాగా ఒక తమిళ టీవీ షోలో ఆమె ‘వర్షం’ ప్రస్తావన తెచ్చింది. తన కెరీర్లో అత్యంత ఇబ్బంది పడ్డ సినిమా అదే అని త్రిష చెప్పడం విశేషం. మీ కెరీర్లో బాగా కష్టపడి చేసి సినిమా ఏది అని యాంకర్ త్రిషను అడగ్గా.. ఆ షోలో త్రిషతో కలిసి పాల్గొన్న ఆమె తల్లి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది.
త్రిష కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ అనే సినిమాలో నటించిందని.. దాని కోసం మామూలు కష్టం పడలేదని త్రిష తల్లి చెప్పింది. ఈ సినిమా కోసం 45 రోజుల పాటు వర్షంలో షూటింగ్ చేశారని.. దీంతో జలుబు, జ్వరంతో త్రిష బాగా ఇబ్బంది పడిందని.. ఒక దశలో సినిమా వదిలేసి ఇంటికి వెళ్లిపోదామని కూడా అనుకుందని ఆమె చెప్పింది. ఐతే చివరికి సినిమా ఫలితం చూశాక పడ్డ కష్టం అంతా మరిచిపోయిందని.. అంత కష్టపడదగ్గ సినిమానే అది అనిపించిందని త్రిష తల్లి అభిప్రాయపడింది.
అనంతరం త్రిష మాట్లాడుతూ.. తన తల్లి చెప్పిన మాటలు నూటికి నూరుశాతం నిజం అని వెల్లడించింది. ఆ సినిమా టైంలో చాలా కష్టమైందని.. కానీ అది స్పెషల్ ఫిలిం అని త్రిష పేర్కొంది. ఎం.ఎస్.రాజు నిర్మాణంలో దివంగత దర్శకుడు శోభన్ రూపొందించిన ‘వర్షం’ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రాన్ని తమిళంలో జయం రవి, శ్రియ హీరో హీరోయిన్లుగా రీమేక్ చేశారు.
This post was last modified on November 27, 2024 4:41 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…