ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, ప్రతి ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఫౌజీ కూడా దానిలో ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమవుతున్న కొత్త నటి ఇమాన్వి ఇస్మాయిల్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర వివరాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. హీరోయిన్ ఎంపికలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది.
అన్ని స్క్రీన్ టెస్టులు, పాత్రకు సరిపోయే లుక్స్, పెర్ఫార్మెన్స్ పరీక్షించి చివరికి ఇమాన్విని సెలెక్ట్ చేశారు. ఇక ఫౌజీ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తమిళనాడులో ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరించారు. ప్రభాస్ డేట్స్ 2025 సంక్రాంతి తర్వాత అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఇక హీరోయిన్ ఇమాన్వి ఎప్పుడైతే ప్రభాస్ తో నతోస్తోంది అనే వార్తలు వచ్చాయో అప్పటి నుంచి ఇంటర్నెట్ వరల్డ్ లో అమ్మడి పేరు తెగ ట్రెండ్ అయ్యింది.
అయితే ఇమాన్వి కి ఇప్పటివరకు అనేక పాన్ ఇండియా చిత్రాల నుంచి ఆఫర్స్ వచ్చాయని టాక్. కానీ ఆమె ఒప్పుకోవడం లేదట. దానికి ప్రధాన కారణం ఫౌజీ నిర్మాతలు పెట్టిన కండిషన్స్. ప్రస్తుతం ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ లోకి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి హీరోయిన్ డేట్స్ విషయంలో ఇబ్బందులు రాకూడదని ముందే ఫిక్స్ అయ్యారు. ప్రస్తుత పెద్ద హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని, అందుకే కొత్త నటి ఇమాన్విని తీసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ మొదట్లోనే నిర్ణయం తీసుకున్నారట.
ఇది ఆమె తొలి సినిమా అయినప్పటికీ, ప్రభాస్ వంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం ఇమాన్వికి దక్కడం విశేషం. ఈ కారణంగా ఇమాన్వితో ఏడాది కాలం పాటు కాల్ షీట్స్ బ్లాక్ చేసుకున్నారట. ప్రత్యేకంగా, ఆమెకు బిజినెస్ క్లాస్ ప్రయాణం, 5-స్టార్ హోటల్ విడిది వంటి సౌకర్యాలను కూడా అందించబోతున్నారని తెలుస్తోంది. ఇమాన్వి అమెరికాలో నివసిస్తున్న నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ కోసం ఎప్పుడైతే ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ కి డేట్స్ అందుబాటులో ఉంటాయో, అప్పుడు వెంటనే రప్పించేలా ఏర్పాట్లు చేసుకున్నారని టాక్. అందుకే ఆమె ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదట.
This post was last modified on November 27, 2024 11:30 am
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…