అందరూ పుష్ప 2 ది రూల్ మేనియాలో ఉండటంతో ఇతర సినిమాల అప్డేట్స్ జనాలకు చేరేందుకు టైం పడుతోంది. ఏదైనా స్పెషల్ గా అనిపిస్తే తప్ప నెటిజెన్లు పట్టించుకోవడం లేదు. అందుకే సంక్రాంతి రిలీజులు ప్రస్తుతానికి మౌనం వహించి డిసెంబర్ 5 తర్వాత హడావిడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే గేమ్ ఛేంజర్ క్రమం తప్పకుండ ప్లాన్ చేసుకున్న ప్రమోషన్లను యధావిధిగా చేసుకుంటూ పోతోంది. అందులో భాగంగా రేపు నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. దానికి సంబంధించిన చిన్న బిట్వీన్ ది సెట్స్ వీడియోని నిన్న సాయంత్రం తమన్ పంచుకున్నాడు.
కార్తీక్, శ్రేయ ఘోషల్ లు పాడిన రెండు మూడు లైన్లు మాత్రమే అందులో పొందుపరిచారు. మిగిలిన టైంలో వీళ్ళ ఇంటర్వ్యూ విశేషాలు పెట్టేశారు. అయితే కేవలం పాటలో కొద్ది భాగమే అయినప్పటికీ రామజోగయ్యశాస్త్రి రచనలో నానా హైరానా అంటూ సాగే చిన్న లిరిక్ మ్యూజిక్ లవర్స్ కి విపరీతంగా ఎక్కేసింది. నిమిషాల వ్యవధిలోనే వేలాదిగా ట్వీట్లు, ఎడిట్లు ప్రత్యక్షమైపోయాయి. మెలోడీ పాటలను చేయించుకోవడంలో దర్శకుడు శంకర్ అభిరుచి జెంటిల్ మెన్ నుంచి 2.0 దాకా చాలా సార్లు చూశాం. ఇండియన్ 2లోనూ గమనించవచ్చు. అలాంటిది తమన్ లాంటి శిష్యుడు దొరికితే వదులుతారా. అదే జరిగింది.
మొత్తానికి నానా హైరానా చిన్నదే అయినా ఆన్ లైన్ లో పెద్ద హంగామా చేసింది. ఈ పాటను ఇన్ఫ్రా రెడ్ క్యామెరాతో షూట్ చేశారు. ఒరిజినల్ లొకేషన్లలో ఉన్న అందాన్ని మెరుగుపరిచి చూపించడం దీని ప్రత్యేకత. విదేశాల్లో, సెట్స్ లో భారీ వ్యయంతో చిత్రీకరించిన ఈ పాట గేమ్ ఛేంజర్ ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలుస్తుందట. జనవరి 10 విడుదలకు రెడీ అవుతున్న గేమ్ ఛేంజర్ ఈవెంట్ వచ్చే నెల నుంచి ఊపందుకోబోతున్నాయి. ఆర్సి 16లో ప్రస్తుతం మైసూర్ లో ఉన్న రామ్ చరణ్ ఆ షెడ్యూల్ కాగానే పెద్ద బ్రేక్ తీసుకుని డిసెంబర్ నుంచి పబ్లిసిటీలో భాగం కాబోతున్నాయి. 21న అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక ఉంటుంది.
This post was last modified on November 27, 2024 11:25 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…