విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన విడుదల పార్ట్ 2 డిసెంబర్ 20న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మొదటి భాగం తమిళంలో ఘనవిజయం సాధించింది కానీ తెలుగులో కమర్షియల్ అద్భుతాలు చేయలేదు. కాకపోతే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ ని అత్యంత సహజంగా చూపించే క్రమంలో వెట్రిమారన్ ఎంచుకున్న బోల్డ్ స్టైల్ మన సామాన్య మాస్ జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. కానీ పార్ట్ 2 మాత్రం దానికి భిన్నంగా అసలైన కంటెంట్ ఇప్పుడు చూస్తారనేలా ఉంది. నిన్న లాంచ్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది.
విడుదల పార్ట్ 1 అధిక శాతం సూరి మీద నడవగా సీక్వెల్ మొత్తం విజయ్ సేతుపతి చేతిలో పెట్టారు. అణగారిన వర్గాలకు చెందిన ఒక యువకుడు జనంలో చైతన్యం రప్పించడం కోసం తుపాకీ పట్టి ఎంతటి విధ్వంసానికి పాల్పడ్డాడో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. దశాబ్దాల వెనుకటి కథే అయినప్పటికీ ఇప్పటి ఆడియన్స్ కి అర్థమయ్యేలా వెట్రిమారన్ ఎంచుకున్న మేకింగ్ స్టైల్ ఆద్యంతం ఆసక్తిగా అనిపిస్తోంది. దానికి తోడు ఇళయరాజా సంగీతం హైప్ ని ఇంకా పైకి తీసుకెళ్తోంది. మంజు వారియర్ లాంటి ఆర్టిస్టులు ఈసారి తోడవ్వడంతో క్యాస్టింగ్ పరంగానూ విడుదల పార్ట్ 2 మీద బజ్ పెరుగుతోంది.
విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ వెట్రిమారన్ టీమ్ డేట్ మార్చుకునే ఉద్దేశంలో లేదు. ఇప్పటికీ కొంచం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉందట. అన్ని భాషలు కలిపి పన్నెండుకి పైగా సినిమాలు క్రిస్మస్ బరిలో ఉన్నాయి. అయినా సరే వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ వచ్చిన రెండు వారాలకే రిలీజ్ చేయడం రిస్కని పలువురు వారించినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. పార్ట్ 2 ఈసారి టాలీవుడ్ జనాలకు ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. తెలుగు ట్రైలర్ తో పాటు ఇతరత్రా ప్రమోషన్లను త్వరలోనే ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
This post was last modified on November 27, 2024 11:01 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…