పుష్ప-2 సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమా నేపథ్య సంగీతం విషయంలో పెద్ద వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వర్క్ నచ్చక.. వేరే సంగీత దర్శకులతో సుకుమార్ కొన్ని ఎపిసోడ్లకు బీజీఎం చేయిస్తున్నాడు. తమన్‌తో పాటు సామ్ సీఎస్, అజనీష్ లోక్‌నాథ్‌లను ఇందుకోసం తీసుకున్నారు. ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎంతగా హర్ట్ అయ్యాడో ఇటీవల చెన్నైలో జరిగిన ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్పష్టంగా తెలిసిపోయింది.
సుకుమార్ మీద ఉన్న కోపాన్ని ఇన్‌డైరెక్ట్‌గా నిర్మాతల మీద చూపించేశాడు దేవి. తాను మ్యూజిక్ విషయంలో ఆలస్యం చేస్తానంటూ ‘పుష్ప-2’ నిర్మాతలు తనను నిందిస్తారంటూ అతను కౌంటర్లు వేశాడు. అంతే కాక మనకు కావాల్సింది మనం అడిగి తీసేసుకోవాలి పేమెంట్ అయినా, క్రెడిట్ అయినా.. అంటూ అతను చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరిగింది.ఈ ప్రసంగంలోనే తాను ‘పుష్ప-2’లో ప్రతి రీల్‌కూ నేపథ్య సంగీతం అందించానని దేవి ఓ కామెంట్ చేశాడు. మరి మిగతా ముగ్గురు సంగీత దర్శకుల మాటేంటి అనే చర్చ నడిచింది. ఐతే దేవి తన వరకు మొత్తం సినిమాకు నేపథ్య సంగీతం అందించగా.. అందులో ఏది వాడుకుంటారో, ఏది వేరే వాళ్లతో రీప్లేస్ చేస్తారో తనకు సంబంధం లేదని భావిస్తున్నాడు.
అందుకే తనకు రావాల్సిన ఫుల్ పేమెంట్ తీసుకోవడంతో పాటు టైటిల్ క్రెడిట్స్ కూడా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడట. తన పేరు ముందు కేవలం సంగీతం అని కాకుండా, నేపథ్య సంగీతం కూడా అని వేయాలని అతను పట్టుబడుతున్నట్లు సమాచారం. మిగతా ముగ్గురు సంగీత దర్శకులకు క్రెడిట్ ఇచ్చేట్లున్నా.. వాళ్లతో కలిపి తన పేరు వేయొద్దని, తనకు వేరే క్రెడిట్ ఉండాలని అతను తేల్చి చెప్పాడట. సుకుమార్ సహా చాలామంది దర్శకులు ముందు స్క్రీన్ ప్లే, మాటలు అంటూ వేరే పేర్లు వేసి.. చివరికి రచన-దర్శకత్వం అని తమ పేరు వేసుకుంటారు. దేవి సైతం ఇదే తరహాలో తనకు సంగీతం, నేపథ్య సంగీతం అని ప్రత్యేకంగా క్రెడిట్ ఇవ్వాలని నిర్మాతలకు కండిషన్ పెట్టినట్లు సమాచారం.
This post was last modified on November 27, 2024 10:24 am
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…