అక్కినేని ఇంట్లో నాగచైతన్య పెళ్లి బాజాలు వచ్చే వారం మ్రోగబోతున్న తరుణంలో నాగార్జున మరో శుభవార్త పంచుకున్నారు. అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నట్టు కాబోయే కోడలిని ఫోటోల రూపంలో ట్విట్టర్ ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. ఆమె పేరు జైనబ్ రవ్ జీ. 2004లో వచ్చిన మీనాక్షి టేల్ అఫ్ 3 సిటీస్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలు. చిత్రలేఖనంలో గొప్ప ప్రవేశం ఉంది. భాగ్యనగరంతో పాటు పలు నగరాల్లో జైనాబ్ ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్లకు భారీ స్పందన వచ్చేది. పలు పురస్కారాలు దక్కాయి. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉన్నప్పటికీ జైనబ్ రవ్ జీ పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.
అఖిల్ తో పరిచయం పెళ్లిదాకా ఎలా దారి తీసిందన్న వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త చూసి సర్ప్రైజ్ అవుతున్నారు. ఇది కనీసం లీకుల రూపంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఒక్కసారిగా స్వీట్ షాక్ లా అనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం జరిగిన అఖిల్ నిశ్చితార్థం పెళ్లి దాకా వెళ్ళకపోవడంతో నాగ్ ఈసారి ఎక్కువ హడావిడి లేకుండా ఇద్దరు పిల్లల వివాహానికి సంబంధించిన వార్తను హడావిడి లేకుండా ప్రపంచానికి చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సంవత్సరంలోనే మనవళ్ల శుభకార్యాలు జరగడం గమనించాల్సిన విషయం.
త్వరలోనే ప్రారంభం కాబోతున్న కొత్త సినిమా కోసం అఖిల్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది. యువి క్రియేషన్స్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచారు. ఏజెంట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న అఖిల్ ఈసారి బెస్ట్ స్క్రిప్ట్ కావాలన్న ఉద్దేశంతో సెట్స్ లో అడుగు పెట్టకుండా కథల మీద ఫోకస్ పెట్టాడు. 2025లో ఖచ్చితంగా ఒక రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి కూడా అదే ఏడాది జరుగనుంది.
This post was last modified on November 26, 2024 5:51 pm
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…