Movie News

ఆల్ ఇండియా టాప్ 1 పారితోషికం బన్నీదే!

మాములుగా స్టార్ హీరోల రెమ్యునరేషన్లు బహిర్గతంగా బయటికి చెప్పరు. మీడియాకు దొరికిన సోర్స్ నుంచి ప్రపంచానికి వెల్లడి చేయడం ఎప్పుడూ జరిగేదే కానీ దానికి చాలా సందర్భాల్లో అధికారిక ధృవీకరణ ఉండదు. కొన్నిసార్లు ఫలానా నటుడు ఇంత మొత్తంలో పన్ను కట్టాడని ఆదాయపు శాఖ వెల్లడి చేస్తేనే అర్థమయ్యేది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా పత్రిక టాప్ 10 నటీనటుల జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం ఎవరికి అందనంత ఎత్తులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ కు గాను 300 కోట్ల పారితోషికం అందుకున్నాడని పేర్కొంది. అంటే ఇండియాలోనే అత్యధికం అన్నమాట.

తర్వాత స్థానంలో విజయ్ తన 69వ సినిమా కోసం 275 కోట్లు తీసుకున్నట్టు పేర్కొంది. ఆపై షారుఖ్ ఖాన్, రజనీకాంత్ (150 – 270 కోట్లు), అమీర్ ఖాన్ (100 – 175 కోట్లు), ప్రభాస్ (100 – 200 కోట్లు), అజిత్ (100 – 165 కోట్లు), సల్మాన్ ఖాన్ (100 – 150 కోట్లు), కమల్ హాసన్ (100 – 150 కోట్లు), అక్షయ్ కుమార్ (65 – 145 కోట్లు) లను జాబితాలో ఇచ్చింది. ఫోర్బ్స్ లిస్టు చూస్తే టాలీవుడ్ స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప 2కి బన్నీ ఇంత మొత్తం అందుకోవడం రికార్డే. ఈ లెక్కన బడ్జెట్ తో కలిపి పుష్ప 2కి అయిన ఖర్చు అయిదు వందల కోట్లపై మాటే. థియేటర్, నాన్ థియేటర్ బిజినెస్ రెట్టింపు స్థాయిలో జరుగుతోంది.

డిసెంబర్ 5 విడుదలకు రెడీ అవుతున్న పుష్ప 2 ది రూల్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో తీవ్రంగా ఉండేలా ఉంది. కిస్సిక్ దెబ్బలు పడతాయి ఐటెం సాంగ్ ఇప్పటికే వ్యూస్ లో రికార్డులు సృష్టించగా ప్రీమియర్ల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు సంగతి పక్కనపెడితే కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఇప్పటిదాకా ఏ సౌత్ హీరోకి దక్కనంత భారీ రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డుల ఊచకోత మాములుగా ఉండదు. అన్నీ సరిగా కుదిరితే రాజమౌళి పేరుమీద మైలురాళ్లను అల్లు అర్జున్ సులభంగా దాటేస్తాడు. ఫ్యాన్స్ దానికోసమే వెయిటింగ్.

This post was last modified on November 26, 2024 5:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బీఆర్ఎస్ కు ఇచ్చి పడేసిన రేవంత్

తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ సాగుతున్న ఉహాగానాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు…

15 minutes ago

క్రేజీ టైటిల్ పట్టేసిన కమెడియన్

అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత కమెడియన్‌ అవతారమెత్తి ఒక సమయంలో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సప్తగిరి.. ఆపై…

34 minutes ago

బిగ్‌బాస్ ప్రైజ్ మనీ ఇంకా రాలేదు

బిగ్‌బాస్ 18 విజేతగా నిలిచిన కరణ్ వీర్ మెహ్రా, ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న సంగతి…

36 minutes ago

ప్రేమ పిచ్చిలో… ఇంటికొచ్చి తగలబెట్టేశాడు

బెంగళూరులో ఓ యువతి ఇంటి వద్ద జరిగిన ఆగడాలు అందరినీ షాక్‌కు గురి చేశాయి. శనివారం అర్ధరాత్రి తన మాజీ…

60 minutes ago

వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీసు కస్టడీ

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని…

1 hour ago

ఇక రాను.. తేల్చిచెప్పేసిన జగన్

ఏపీ అసెంబ్లీలో అధికార కూటమి ప్రచారం చేస్తున్నట్లుగా విపక్షం వైసీపీ సింగిల్ డే షోకే పరిమితం అయిపోయింది. సభలో తాము…

2 hours ago