గీత రచయిత కులశేఖర్ ఇవాళ అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్ను మూశారు. సినిమా పాటల సాహిత్య ప్రియులకు ఈయన పరిచయం అక్కర్లేదు. దర్శకుడు తేజతో కలిసి పని చేసిన తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న కులశేఖర్ కెరీర్ ప్రారంభంలో ఈనాడులో పని చేశారు. భాస్కరభట్ల రవికుమార్ ఈయన సహోద్యోగి. పుట్టిపెరిగిన ఊరు సింహాచలం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దగ్గర కొంత కాలం శిష్యరికం చేశాక పాటల రచన కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉషాకిరణ్ సంస్థలో ఉన్నప్పుడే తేజతో ఏర్పడిన పరిచయం ఉదయ్ కిరణ్ చిత్రం ద్వారా తొలి ఛాన్స్ వచ్చేలా చేసింది.
డెబ్యూతోనే అదిరిపోయే ఆల్బమ్ పడటంతో కులశేఖర్ కొంతకాలం వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఆర్పి పట్నాయక్ ప్రోత్సాహం ఎక్కువగా ఉండేది. దాని వల్లే మణిశర్మ చిరంజీవి మృగరాజు లాంటి అవకాశాలు ఇచ్చారు. వెంకటేష్ ఘర్షణ – వసంతంలో మంచి పాటలు పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ సుబ్బుకి రాశారు. సుమారు వంద సినిమాలకు కులశేఖర్ పని చేశారు. కెరీర్ మసకబారుతున్న టైంలో హఠాత్తుగా మాయమైన కులశేఖర్ 2013లో ఒక గుడిలో దొంగతనం నేరం మీద జైలుకు వెళ్లి వచ్చారు. అంతకు ముందే 2008లో జ్ఞాపకశక్తి పోయిందని స్నేహితులు అంటుండేవారు.
ఇద్దరు పిల్లలు సంతానం కలిగిన కులశేఖర్ కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. కొంచెం కుదుటపడ్డాక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. మాములు మనిషి అవుతాడనుకుంటున్న టైంలో ఇలా విషాద వార్త వినాల్సి వచ్చింది. ఈయన ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించగా విపరీతమైన జాప్యం తర్వాత రిలీజయ్యింది. ఫ్లాప్ కావడం మానసికంగా కృంగదీసిందని సన్నిహితుల మాట. సినిమాలో చూసే డ్రామాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ముగిసిన కులశేఖర్ భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన పాటల ద్వారా ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటారు.
This post was last modified on November 26, 2024 4:54 pm
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…