‘పుష్ప: ది రైజ్’తో పోలిస్తే ‘పుష్ప: ది రూల్’ పాటలు అంచనాలకు తగ్గట్లు లేవన్న అభిప్రాయాలు మెజారిటీ జనాల్లో ఉన్నాయి. ఇందులో పాటలు బాలేవని అనలేం. కానీ ‘పుష్ప-1’ స్థాయిలో మాత్రం వైరల్ కాలేదు. టైటిల్ సాంగ్, చూసేకి, కిసిక్.. మూడు పాటల విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలే కలిగాయి. లేటెస్ట్‌గా వచ్చిన ఐటెం సాంగ్ ‘కిసిక్’.. ‘పుష్ప’లోని ‘ఊ అంటావా..’ పాట ముందు అస్సలు నిలవలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐతే ‘ఊ అంటావా..’ పాట కూడా మొదట విన్నపుడు మామూలుగా అనిపించింది. కానీ తర్వాత అది సోషల్ మీడియాను షేక్ చేసేసింది. దేవిశ్రీ ఐటెం సాంగ్స్‌లో చాలా వాటికి ఇలాగే జరిగింది. ‘కిసిక్..’ సాంగ్ కూడా నెమ్మదిగా జనాలకు బాగా ఎక్కేస్తుందని.. ‘దెబ్బలు పడతాయి..’ అనే హుక్ వర్డ్ చాలా పాపులర్ అవుతుందని టీం భావిస్తోంది.
ఐతే తెలుగు సాంగ్ సంగతి ఏమో కానీ.. దీని హిందీ వెర్షన్ మాత్రం ఆల్రెడీ వైరల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. హిందీలో ‘తప్పడ్ మారుంది సాలా..’ అంటూ సాగుతుందీ పాట. అందులోని వర్డ్స్ హిందీ ప్రేక్షకలకు చాలా క్యాచీగా అనిపిస్తున్నాయి. ఇక దేవి పాట అంటే బీట్‌కు ఢోకా ఉండదు. ఈ పాట మంచి ఊపుతో సాగడంతో హిందీ ఆడియన్స్ ఈ పాటతో అప్పుడే రీల్స్‌తో మోత మోగించేస్తున్నారు. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నట్లే కనిపిస్తోందీ సాంగ్. ‘పుష్ప’ సినిమాను తెలుగులో కంటే హిందీలోనే బాగా చూశారు. ఆ సినిమా మేనరిజమ్స్, పాటలు అక్కడే ఎక్కువ వైరల్ అయ్యాయి. ‘పుష్ప-2’ మీద అంచనాలు కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి. బాలీవుడ్లో ఇలాంటి ఊపున్న మాస్ పాటలు రావడం తక్కువ. దీంతో అక్కడి జనం ‘తప్పడ్ మారుంగి సాలా’ అంటూ ఊగిపోతున్నారని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.
This post was last modified on November 26, 2024 4:19 pm
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…