ఈ మధ్యే విడుదలైన ‘గేమ్ చేంజర్’ సినిమా టీజర్లో చాలా విశేషాలు కనిపించాయి. పెద్దగా డైలాగులు, సీన్లు ఏమీ లేకుండా.. బోలెడన్ని షాట్స్ వేసి సినిమా కథ, పాత్రల విషయంలో ప్రేక్షకులను టీజ్ చేశాడు దర్శకుడు శంకర్. టీజర్లో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన క్యారెక్టర్లలో శ్రీకాంత్‌ది ఒకటి. ఈ సీనియర్ నటుడు రాజకీయ నాయకుడి పాత్రలో గుర్తు పట్టలేని అవతారంలో కనిపంచి ఆశ్చర్యపరిచాడు. శ్రీకాంత్ తన కెరీర్లో ఎన్నో భిన్నమైన పాాత్రలు చేశాడు కానీ.. లుక్ పరంగా ఎక్కువ వైవిధ్యం చూపించింది లేదు. ‘అఖండ’లో కొంచెం కొత్తగా కనిపించాడు. దాంతో పోలిస్తే ‘గేమ్ చేంజర్’ లుక్ షాకింగే. బట్టతలతో కనిపించిన శ్రీకాంత్‌ను చూసి చాలామంది గుర్తు పట్టకపోయి ఉంటే ఆశ్చర్యం లేదు. గుర్తు పట్టిన వాళ్లు మేకప్ భలే వేశారే అనుకున్నారు.శ్రీకాంత్ లుక్‌ను ఇలా తీర్చిదిద్దడానికి ఆయన తండ్రినే రెఫరెన్సుగా తీసుకున్నారట ‘గేమ్ చేంజర్’ మేకప్ బృందం.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న శ్రీకాంత్ తండ్రి ఫొటో చూస్తే.. ఆయన లుక్‌కు చాలా దగ్గరగా ఉంది. శ్రీకాంత్ లుక్ ఏమాత్రం అసహజంగా అనిపించడం లేదు. ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా ఆయన్ని ఇలా మార్చింది టీం. శంకర్ అంటే మేకప్ సహా ప్రతి టెక్నికల్ విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటాడని పేరుంది. ఆ పేరుకు తగ్గట్లే శ్రీకాంత్ లుక్‌ను సూపర్‌గా తీర్చిదిద్దారు. సినిమాలో శ్రీకాంత్ పాత్ర నెెగెటివ్ టచ్‌తో ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ సైతం ఈ సినిమాలో మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ టీం చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. కొన్ని రోజుల్లోనే షూట్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటికే బాగా ఆలస్యం అయిన ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 26, 2024 2:00 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…