ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’ ఇంకో తొమ్మిది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రిలీజ్ ముంగిట టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఐతే టీం పనిగట్టుకుని చేస్తున్న ప్రమోషన్ల కంటే.. ఓ వివాదం వల్ల ఈ చిత్రానికి వచ్చిన పబ్లిసిటీ ఎక్కువ. తన ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ఉండగా.. బీజీఎం బాధ్యతలను వేరే సంగీత దర్శకులకు అప్పగించడానికి డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించుకోవడం పెద్ద షాక్. తమన్‌తో పాటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌లను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా అని దేవిశ్రీనేమీ పక్కన పెట్టేయలేదు. అతనూ బీజీఎం మీద వర్క్ చేస్తున్నాడు. వీళ్లకూ కొన్ని సీన్లు పంచారు. అందరి పనితనం చూసి ఏ సన్నివేశానికి ఏది బాగుందనిపిస్తే అది తీసుకోవాలన్నది సుకుమార్ ఆలోచన. ఐతే మిగతా వాళ్ల సంగతి పట్టించుకోకుండా దేవి అయితే మొత్తం సినిమాకు తన స్కోర్ దాదాపుగా పూర్తి చేశాడు.
సినిమాలో మెజారిటీ సీన్లలో దేవి బీజీఎంనే వాడుతున్నారు. సామ్ సీఎస్ తనకు అప్పగించిన సీన్లకు బీజీఎం పూర్తి చేసి టీంకు అప్పగించేశాడు. అందులో ఒక ఎపిసోడ్‌కు అతను అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పాటు మరో సన్నివేశానికి సామ్ స్కోర్‌ను లాక్ చేశాడట సుకుమార్. సామ్ సైతం సోషల్ మీడియాలో పుష్ప-2 పోస్టర్ పెట్టి తన ఆనందాన్ని ప్రకటించాడు. అజనీష్ లోక్‌నాథ్ తన వర్క్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. మంగళవారమే అతను స్కోర్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. రాత్రికి తన స్కోర్‌లో ఏది వాడుకుంటారో ఫైనలైజ్ అవుతుంది. ఇక తమన్ విషయానికి వస్తే.. అతడి బీజీఎం సినిమాలో పెద్దగా వినిపించకపోవచ్చని సమాచారం. తమన్ వర్క్ విషయంలో సుకుమార్ అంత సంతృప్తిగా ఏమీ లేడట. మొత్తంగా తమన్ వర్క్ పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని.. ఒకవేళ వాడినా నామమాత్రంగా మాత్రమే ఉంటుందని పుష్ప-2 టీం వర్గాల సమాచారం.
This post was last modified on November 26, 2024 1:51 pm
ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్ని కల సంఘం…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ నేత కనుమూరి రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ఈ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఏపీకి సంబంధించిన పర్యాటక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి గజేంద్ర…
అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. సమంత నుంచి విడిపోయాక కొన్నేళ్లు సింగిల్‌గా ఉన్న అతను.. బాలీవుడ్లో స్థిరపడ్డ…
డబ్బింగ్ మూవీ ‘బాయ్స్’తో తెలుగులో మంచి ఫలితాన్నందుకుని.. స్ట్రెయిట్‌గా తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్లలో నటించి…