నాగచైతన్యతో వైవాహిక జీవితం విడాకుల రూపంలో ఎప్పుడో ముగిసిపోయినా దాని తాలూకు నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయంటోంది సమంతా. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతుతో విడిపోయాక తన మీద చాలా కామెంట్స్ వచ్చాయని, సెకండ్ హ్యాండ్, వృథా చేసుకున్న జీవితం, తప్పుడు నిర్ణయం ఇలా ఎన్నో రకాలుగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారని, అయితే ఇలాంటి దశను అనుభవించిన ఎందరో ఆడవారి స్థితిని అర్థం చేసుకున్న తనకు ఇది ఓటమిలా కాకుండా ఒక కొత్త జీవితానికి గెలుపుగా అనిపించిందని వివరించింది.
డైవోర్స్ తీసుకున్నంత మాత్రాన తలుపులు వేసుకుని ఏడ్వాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో మరింత సాధించేందుకు ప్రేరణ పొంది కెరీర్ లో ఇంకా కష్టపడే తత్వాన్ని అలవరుచుకున్నానని చెప్పిన సమంత జరిగిందేదో జరిగిపోయింది, ఇది ప్రారంభం తప్ప ముగింపు కాదని ఒక ఫిలాసఫీ టచ్ కూడా ఇచ్చింది. చైతు వచ్చే నెల మొదటివారంలో శోభితను పెళ్లి చేసుకోబోతున్న వేళ సామ్ ఇలా చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే సిటాడెల్ ప్రమోషన్లలో వరుణ్ ధావన్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తన ఎక్స్ కు ఇచ్చిన కానుకలకు చాలా ఖర్చు పెట్టానని చెప్పడం వైరలయ్యింది.
ఇదంతా చైతు ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. జరిగిందేదో జరిగిపోయిందన్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎందుకని అడుగుతున్నారు. ఒకవేళ ప్రశ్న ఎదురైనా తప్పించుకోకుండా ఏదో తీవ్రనష్టం జరిగిన తరహాలో ఇంత వివరణ ఎందుకని నిలదీస్తున్నారు. చైతు ఎక్కడా తన మాజీ భార్య గురించి మాట వరసకు సైతం ప్రస్తావించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. సరే ఎవరి వాక్ స్వాతంత్య్రానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు కానీ సామ్ అన్న మాటలు మాత్రం చర్చకు దారి తీస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లో బ్లాక్ బస్టరవుతుందనుకున్న సిటాడెల్ హాన్నీ బన్నీ అంత ఫలితం అందుకోలేకపోయింది.
This post was last modified on November 26, 2024 12:29 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…