సూర్య కెరీర్ లోనే అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన కంగువా ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. వసూళ్లు వంద కోట్లు దాటినప్పటికీ దానికిచ్చిన బిల్డప్ కి కనీసం అయిదు వందల కోట్లయినా దాటి ఉండాలి. కానీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అసాధ్యమనేలా ఎదురీదుతోంది. ఇదిలా ఉండగా కంగువ ఫ్లాప్ ని ఫ్యాన్స్ అంగీకరిస్తున్నారు కానీ టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు మేము గొప్ప సినిమా తీశాం, కొన్ని వర్గాలు కావాలని తప్పుడు ప్రచారం చేసి అపజయం కలిగేలా చేశారని ఇప్పటికీ చెప్పుకునే పనిలో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం
తాజాగా కంగువ సహనిర్మాతైన ధనుంజయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఉద్దేశపూర్వకంగా తమ చిత్రాన్ని నెగటివ్ ప్రచారంతో చంపేశారని, ఇందులో రెండు రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉందని చెప్పడంతో విన్న వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు, సూర్య ఎదగకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారని చెప్పడం మరో ట్విస్టు. నిజానికి సూర్య స్టార్ డం చిన్నదేం కాదు. కాకపోతే ఆయన ఎంచుకుంటున్న కథలు, దర్శకులు తప్పటడుగుల వైపు తీసుకెళ్తున్నారు. అంతే తప్ప ఫలానా వర్గం విషం చిమ్మినంత మాత్రాన చితికిపోయేంత బలహీన మార్కెట్ సూర్యకు లేదు.
ఇది మర్చిపోయి పదే పదే కంగువని గొప్ప సినిమాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇవ్వకపోగా రివర్స్ లో విమర్శలు తెచ్చి పెడుతోంది. ఆ మధ్య సూర్య భార్య జ్యోతిక సైతం ఒక మూవీ లవర్ గా కంగువ చూశాక క్లాసిక్ అనిపించిందని, కొందరు కావాలని బ్యాడ్ చేశారని అనడం పట్ల ఎక్కువ శాతం మద్దతు దక్కలేదు. ఎవరు ఏం చేసినా, ఎన్ని అన్నా చివరికి గెలిచేది బాగున్న మంచి సినిమానే. అమరన్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేదు. నెల తిరక్కుండానే విజయ్ గోట్ ని దాటేసింది. కంగువ కూడా నిజంగా అదిరిపోయి ఉంటే బాహుబలి, కెజిఎఫ్ సరసన నిలిచేది. అలా జరగకపోవడమే ఇంత రచ్చకు కారణం.
This post was last modified on November 26, 2024 3:35 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…