ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా ఒక ప్యాన్ ఇండియా సినిమాని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం ప్రమోషన్ల పరంగా పెద్ద సవాల్. ఇది గుర్తించారు కాబట్టి రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైంలో ఇద్దరు హీరోలను వెంటేసుకుని ముంబై నుంచి హైదరాబాద్ దాకా విపరీతంగా తిరిగి మరీ పబ్లిసిటీ చేసుకున్నారు. ఎంత ప్రీ రిలీజ్ హైప్ ఉన్నా సరే తమ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడంలో దర్శక నిర్మాతలు అనుసరించే మార్కెటింగ్ స్ట్రాటజీనే ఓపెనింగ్స్ ని నిర్ధారిస్తుంది. డిసెంబర్ 5 రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ది రూల్ దీనికి అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తోంది. అదెలాగో చూద్దాం.
ఇప్పటిదాకా పుష్ప 2 రెండు ఈవెంట్లు చేసింది. ఎవరూ ఆలోచించడానికి కూడా సాహసించని బీహార్ రాష్ట్రం పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేయడం ద్వారా జాతీయ మీడియా దృష్టి దీని వైపు బలంగా పడింది. ఎన్నికల సభలను తలదన్నేలా వచ్చిన జన సందోహం చూసి పోలీసులు షాక్ తిన్నారు. మరుసటి రోజు అక్కడి పేపర్లన్నీ పుష్ప 2 కవరేజ్ తో నిండిపోయాయి. మొన్న చెన్నైలో చేసిన సాంగ్ లాంచ్ మరో బ్లాక్ బస్టర్ వేడుక. అల్లు అర్జున్ తమిళంలో మాట్లాడ్డం, నెల్సన్ దిలీప్ కుమార్ గెస్టుగా రావడం, దేవిశ్రీ ప్రసాద్ వివాదాస్పద స్పీచ్, హీరోయిన్ గ్లామర్ అట్రాక్షన్ వగైరాలు జనంతో నిండిపోయిన స్టేడియంని ఊపేశాయి.
గతంలో ఇతర హీరోలు ఇలా బయట రాష్ట్రాల్లో ప్రమోషన్లు చేశారు కానీ అవన్నీ ప్రెస్ మీట్లకే పరిమితం. కానీ పుష్ప 2 ఒక అడుగు ముందుకు వేసి పబ్లిక్ ప్లేసుల్లో వేడుకలు చేయడం ద్వారా కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. హైప్ ని విపరీతంగా పెంచడంలో విజయం సాధించారు. ఎంత ఖర్చయ్యిందనేది పక్కనపెడితే ఇది ఖచ్చితంగా ఓపెనింగ్స్ మీద సానుకూల ప్రభావం చూపించి అంతకంతా వసూళ్ల రూపంలో వెనక్కు తెస్తుంది. హైదరాబాద్ తో కలిపి ఇంకా దక్షిణాది ప్రమోషన్లు బాకీ ఉన్నాయి. మొదటి రెండు బంతులకే రెండు భారీ సిక్సర్లు కొట్టిన పుష్ప 2 ఇతర ప్యాన్ ఇండియా సినిమాలకు మోడల్ గా నిలుస్తోంది.
This post was last modified on November 26, 2024 11:24 am
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…