Movie News

కీర్తి సురేష్…గ్లామర్ కండీషన్లు లేవు

మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది కానీ ఏదీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటించినప్పటికీ దాని ఫలితం యావరేజ్ దగ్గరే ఆగిపోవడంతో మళ్ళీ స్టార్ల సరసన జోడి కట్టే అవకాశం దక్కలేదు. ఇటీవలే తమిళంలో రఘు తాతతో పలకరించినా ఇది కూడా సేమ్ రిజల్ట్. తెలుగులో వేరే ఆర్టిస్టుతో డబ్బింగ్ చేసి ఓటిటిలో రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. సరే గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ కాలం మడికట్టుకు ఉంటే నెగ్గుకురావడం కష్టం. అందరూ గిరి గీసుకుని సాయిపల్లవిలు కాలేరుగా.

అందుకే కీర్తి సురేష్ రూటు మార్చింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న బేబీ జాన్ మూవీకి కండీషన్లు తీసేసింది. తాజాగా విడుదలైన నైన్ మటక్క పాటలో కాస్ట్యూమ్స్ విషయంలో మొహమాటం తగ్గించడం వీడియో రూపంలో కనిపిస్తోంది. ఇంత గ్లామరస్ గా గతంలో తను కనిపించలేదన్నది వాస్తవం. విజయ్ బ్లాక్ బస్టర్ తేరి రీమేక్ గా రూపొందుతున్న ఈ పోలీస్ డ్రామాకు అట్లీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుండగా కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ లో సమంతా చేసిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ తో చేయించారు. కానీ తేరిలో ఇంత ఊర మాస్ టచ్ సామ్ క్యారెక్టర్ కు లేదు.

ఈ లెక్కన మార్పులు గట్టిగా చేసినట్టు ఉన్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ డిసెంబర్ 25 విడుదల కాబోతోంది. పుష్ప 2 వచ్చిన ఇరవై రోజులకే రిలీజ్ చేయడం సేఫ్ కాదని నార్త్ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నప్పటికీ టీమ్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. ఇది కనక బ్రేక్ ఇస్తే రష్మిక మందన్న తరహాలో తనకూ గుర్తింపు వస్తుందని కీర్తి సురేష్ ఎదురు చూస్తోంది. అయితే సినిమాలో కొంత భాగానికే పరిమితమయ్యే తన పాత్ర ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. తమన్ సంగీతం సమకూరుస్తున్న బేబీ జాన్ లో జాకీ శ్రోఫ్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. తేరి తెలుగు రీమేక్ ఉస్తాద్ భగత్ సింగన్న సంగతి తెలిసిందే.

This post was last modified on November 25, 2024 6:12 pm

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

32 minutes ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

34 minutes ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

1 hour ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

3 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

3 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

3 hours ago