ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో దీన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్ హంగామా లేకుండా ఒక మంచి ఎంటర్ టైనర్ ద్వారా రామ్ ని కొత్తగా చూపించబోతున్నట్టు టాక్ ఉంది. రామ్ తో పాటు మరో సీనియర్ స్టార్ ఇందులో నటిస్తారని తెలిసింది కానీ ఆ నటుడు ఎవరనేది నిర్ధారణ కాలేదు. ఇదిలా ఉండగా ఈ క్రేజీ కాంబో కోసం కోలీవుడ్ నుంచి కొత్త సంగీత ద్వయాన్ని తీసుకొచ్చారు. వివేక్ – మెర్విన్ సంయుక్తంగా స్వరాలు సమకూర్చబోతున్నారు.
వీళ్ళెవరు అనే సందేహం రావడం సహజం. వివేక్ మెర్విన్ కు తమిళంలో మంచి పేరుంది. 2012లో అంబులి ద్వారా పరిశ్రమకు వచ్చారు. తర్వాత నయనతార డోరా, ధనుష్ పట్టాస్ (లోకల్ బాయ్), కార్తీ సుల్తాన్ లాంటి విజయవంతమైన సినిమాలకు పని చేశారు. ఇటీవలే వచ్చిన విజయ్ ఆంటోనీ హిట్లర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే వివేక్ మెర్విన్ లు కంపోజింగ్ లో ఎంత వైవిధ్యం చూపించినా పెద్ద బ్రేక్ దక్కలేదు. అది రామ్ సినిమా రూపంలో అందబోతోంది. అధికారిక ప్రకటన ముందు జరిగిన మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఫ్రెష్ గా అనిపించే మంచి ట్యూన్స్ ఇచ్చారని టాక్ ఉంది.
డబుల్ ఇస్మార్ట్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న రామ్ తిరిగి తన కూల్ అండ్ రొమాంటిక్ లుక్ లోకి వచ్చేశాడు. మహేష్ బాబు చెప్పిన కథ కోసం అయిదారు నెలలు ఆగి మరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా అనిపించాకే సెట్స్ పైకి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది వేసవి విడుదలను టార్గెట్ చేసుకున్న ఈ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర క్యాస్టింగ్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలోపు ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇది పూర్తయ్యేదాకా రామ్ మరో సినిమా ఒప్పుకునే ఆలోచనలో లేడని తెలిసింది.
This post was last modified on November 25, 2024 5:15 pm
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…
ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా…
అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఏఎన్ఆర్ విగ్రహం…
డిసెంబర్ లో పుష్ప 2 సునామి ఉంటుందని తెలిసి కూడా దాని తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ తో…
చెన్నైలో జరిగిన ‘పుష్ప-2’ తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగంతో రాజుకున్న వివాదం సోషల్…