అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఏఎన్ఆర్ విగ్రహం సాక్షిగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఒక్కటి కాబోతున్నారు. అయితే ఆడంబరాలకు దూరంగా కేవలం అతి సన్నిహితంగా ఉండే మూడు వందల మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వివాహం జరగబోతోందని సమాచారం. గతంలో గ్రాండ్ గా చేసిన చై సామ్ వివాహం, అఖిల్ ఎంగేజ్మెంట్ అచ్చిరాని నేపథ్యంలో ఆర్భాటాలకు దూరంగా తండ్రి సాక్షిగా కొడుకు జీవితంలో ఒక మంచి ఘట్టానికి నాగ్ శ్రీకారం చుట్టబోతున్నారట. మరి అభిమానులు ఎక్కడ చూడాలి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం చైతు శోభిత పెళ్లిని డాక్యుమెంటరీగా అందించేందుకు పలు ఓటిటి సంస్థలు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. ఇటీవలే నయనతార జీవితాన్ని కెరీర్ ప్రారంభం నుంచి విగ్నేష్ శివన్ తో పెళ్లి దాకా గంటన్నర వీడియోని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఆశించిన స్థాయిలో భారీ స్పందన రాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం బాగా చూశారు. అదే తరహాలో చైతు శోభితల పెళ్లికి దారి తీసిన ప్రేమ కథ, పరిణామాలు, పెద్దల అంగీకారాలు, ఇతరత్రా ముఖ్యమైన సంఘటనలు అన్నీ పొందుపరిచేలా సినిమా తరహాలో ప్లాన్ చేస్తామని అన్నారట. కానీ నాగ్ దానికి సానుకూలంగా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది.
తండేల్ విడుదల కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్య వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫ్యాన్స్ కి థియేటర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. పెళ్లయ్యాక రిలీజయ్యే మొదటి సినిమా కాబట్టి సెంటిమెంట్ పరంగానూ కలిసి వస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. వేడుకలకు, బయట ఈవెంట్లకు చైతు శోభిత కలిసే వెళ్తున్నారు. ఈ జంట ఒక్కటయ్యే క్షణాల కోసం అభిమానులు ఎదురు చూడటంలో ఆశ్చర్యం లేదు కానీ ప్రచారం జరుగుతున్నట్టు ఒకవేళ డిజిటల్ లో వస్తే మాత్రం వ్యూస్ భారీగా వస్తాయి. సెలబ్రిటీల పెళ్లిళ్లు ఓటిటిలో వచ్చే ట్రెండ్ ఈ మధ్యే ఊపందుకుంటోంది. చైతు లైఫ్ గురించి తెలుస్తుందంటే మూవీ లవర్స్ వద్దంటారా.
This post was last modified on November 25, 2024 5:08 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…