డిసెంబర్ లో పుష్ప 2 సునామి ఉంటుందని తెలిసి కూడా దాని తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ తో చాలా సినిమాలు క్యూ కట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఈ ప్రకటనల లిస్టు పెరిగిపోతోంది. అల్లు అర్జున్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనీసం నెల రోజుల పాటు థియేటర్ల దగ్గర దూకుడు చూపిస్తాడని విశ్లేషకులు లెక్కలు వేస్తున్న నేపథ్యంలో అదేమీ సమస్య కాదన్నట్టు మీడియం నిర్మాతలు రిస్క్ కు సిద్ధపడుతున్నారు. ఒకేసారి ఏడెనిమిది చిత్రాలు తలపడటం చూస్తుంటే ఇదేదో స్పెషల్ సంక్రాంతి అన్న రేంజ్ లో జాబితా కనిపిస్తోంది. అందరిలోనూ కంటెంట్ మీద ధీమా కనిపిస్తోంది.
డిసెంబర్ 20 సంగతి ముందు చూస్తే అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ ఈసారి ఎంటర్ టైన్మెంట్ కాకుండా సీరియస్ డ్రామాని నమ్ముకుని వస్తోంది. పోస్టర్లు, టీజర్ వగైరా మాస్ లో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నాయి. ఉపేంద్ర ‘యుఐ’ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నారు సురేష్ ఏషియన్ సంస్థ. ఆయన స్వీయ దర్శకత్వం కాబట్టి అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. వెట్రిమారన్ ‘విడుదల పార్ట్ 2’లో విజయ్ సేతుపతి విశ్వరూపం ఉంటుందనే వార్తల నేపథ్యంలో తెలుగు వెర్షన్ కు సైతం బజ్ వచ్చేలా ఉంది. ప్రియదర్శి ఇంద్రగంటి కాంబోలో రూపొందిన ‘సారంగపాణి జాతకం’ వెనకు తగ్గనంటోంది.
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎర్రచీర ది బిగినింగ్’ని ఆశ్చర్యకరంగా ఇదే రేసులో దింపడం విశేషం. మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ‘ముఫాసా లయన్ కింగ్’ మీద పిల్లలు ఎంత క్రేజీగా ఉన్నారో వేరే చెప్పనక్కర్లేదు. కొత్త హీరో హీరోయిన్లతో గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ‘మేజిక్’ డిసెంబర్ 21 థియేటర్లకు వస్తుంది. నాలుగు రోజుల గ్యాప్ లో నితిన్ ‘రాబిన్ హుడ్’ డిసెంబర్ 25 రానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం మీద ట్రేడ్ లో బజ్ ఉంది. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అదే రోజు రానుంది. డిసెంబర్ 27 ‘పతంగ్’ అనే చిన్న సినిమాతో ఏడాది ముగియనుంది.
This post was last modified on November 25, 2024 4:49 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…