లక్కీ భాస్కర్.. దీపావళి కానుగా ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన సినిమా. దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో మంచి గుర్తింపే ఉన్నా.. అతడి కోసం థియేటర్లకు జనం పరుగులు పెట్టే స్థాయి అయితే కాదు. పైగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే మరీ క్లాస్ టచ్ ఉన్న, ఇంటలిజెంట్ ఆడియన్సుకే మాత్రమే ఎక్కే సినిమాలా కనిపించింది. దీపావళికి క, అమరన్ లాంటి కంటెంట్ ఉన్న సినిమాలతో పోటీ పడ్డ ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. మొదట్లో వసూళ్లు అంత గొప్పగా లేవు. వచ్చిన టాక్‌కు, వసూళ్లకు పొంతన కనిపించలేదు. కానీ తర్వాత ఈ సినిమా బలంగా పుంజుకుంది.
‘క’ మూవీ తొలి వారం మెరుపుల తర్వాత డౌన్ అవ్వగా.. ‘అమరన్’తో పాటు ‘లక్కీ భాస్కర్’కు వసూళ్లు నిలకడగా సాగాయి. సెకండ్, థర్డ్ వీకెండ్లలో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ కావడం విశేషం. థియేటర్లలో అంచనాలకు మించి ఆడిన ఈ చిత్రం.. వంద కోట్ల క్లబ్బులోకి కూడా అడుగు పెట్టింది.‘లక్కీ భాస్కర్’కు ఇంత లాంగ్ రన్ ఉంటుందని తెలిస్తే ఓటీటీ రిలీజ్ ఇంకొంచెం లేటుగా ఉండేలా ఒప్పందం చేసుకునేవాళ్లేమో. కానీ ముందే చేసుకున్న డీల్ ప్రకారం నెట్ ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని ఈ నెల 28నే రిలీజ ్ చేసేస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’ రిలీజ్ తర్వాత మూడు వారాల్లో వచ్చిన సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఇప్పటికీ ఈ చిత్రం ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబడుతూనే ఉంది.
అయినా ఈ గురువారం నుంచి ‘లక్కీ భాస్కర్’ను స్ట్రీమ్ చేసేయనున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో చూసిన వాళ్లు కూడా మరోసారి చూడాలనుకునే సినిమా ఇది. ఇప్పటికే తెలుగులో మహానటి, సీతారామం లాంటి మైల్ స్టోన్ మూవీస్ చేసిన దుల్కర్ సల్మాన్.. ‘లక్కీ భాస్కర్’తో తన ఫ్యాన్ బేస్‌ను ఇంకా పెంచుకున్నాడు. ఓటీటీ రిలీజ్ తర్వాత అతడి ఫాలోయింగ్ ఇంకా పెరగడం ఖాయం.
This post was last modified on November 25, 2024 4:09 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…