Movie News

సంక్రాంతి నుండి అజిత్ తప్పుకోవడం ఎవరికి లాభం?

2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ పొంగల్ రిలీజ్ అనుకున్న మాట వాస్తవమే కానీ ఇంకా ఏడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ తో పాటు బెస్ట్ సినిమా ఇవ్వాలన్న సంకల్పంతో టీమ్ పని చేస్తున్నందున ఖచ్చితంగా ఆ సీజన్ కు వస్తామని గ్యారెంటీగా చెప్పలేమనే రీతిలో సంకేతం ఇవ్వడంతో అజిత్ రావడం అనుమానమే. ఇంకొద్దిరోజుల్లో ప్రకటన చేస్తామన్నారు కానీ ఫలానా సమయం అని ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు.

ఇప్పుడీ గుడ్ బ్యాడ్ ఆగ్లీ తప్పుకోవడం ఎవరికి లాభమనే కోణం చూద్దాం. ముందుగా బెనిఫిట్ అయ్యేది ఖచ్చితంగా గేమ్ ఛేంజరే. ఎందుకంటే తమిళ వెర్షన్ ని రామ్ చరణ్ ఇమేజ్ తో పాటు దర్శకుడు శంకర్ బ్రాండ్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు. సో అజిత్ కనక పోటీలో ఉంటే థియేటర్ల సమస్య వస్తుంది. ఇప్పుడా స్లాట్ ఖాళీ అయ్యింది కాబట్టి తగినన్ని స్క్రీన్లు దొరికే అవకాశాలు పెరిగాయి. పైగా ఎస్జె సూర్య, జయరాం, కియారా లాంటి క్యాస్టింగ్ కోలీవుడ్ జనాలకు కనెక్ట్ అయ్యేలా ఉంది. అయితే విక్రమ్ వీర ధీర శూరన్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉండటం గేమ్ ఛేంజర్ కు కొంచెం స్పీడ్ బ్రేకర్ గా మారొచ్చు.

మనవైపు చూస్తే గుడ్ బ్యాడ్ ఆగ్లీ నిర్మాతలు మైత్రి కాబట్టి భారీగా కాకపోయినా సాధ్యమైనన్ని థియేటర్లు, షోలు వచ్చేలా చూసుకుంటారు. ఇప్పుడు తప్పుకుంటే అవన్నీ చరణ్, బాలయ్య, వెంకటేష్ పంచుకుంటారు. కొన్ని షోలు పెరిగినా లక్షల్లో గ్రాస్ పెరుగుతుంది కాబట్టి దీన్నో చిన్న విషయంగా కొట్టి పారేయలేం. అజిత్ సినిమా వాయిదా గురించి నిర్మాత పోస్ట్ పోన్ అనే పదం వాడకపోయినా పరోక్షంగా అన్నారు. ఒకవేళ దీని స్థానంలో అజిత్ మరో సినిమా విదాముయార్చి వస్తే ఇబ్బంది లేదు. తెలుగులో దాని మీద అంత బజ్ లేదు కాబట్టి ఆందోళన అనవసరం. చూడాలి ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.

This post was last modified on November 25, 2024 3:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

52 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago