Movie News

దేవీ కి పవన్ చరణ్ సినిమాలు చేజారుతాయా?

నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. పబ్లిక్ స్టేజి మీద నేరుగా నిర్మాతలను ఉద్దేశించి ఒక సంగీత దర్శకుడు స్మూత్ గా అయినా సరే తన అసంతృప్తిని వెళ్లగక్కడం ఇదే మొదటిసారి. బీజీఎమ్ బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పడం పట్ల తాను ఎంత రగిలిపోతున్నాడో దేవి నిన్న స్పీచ్ ద్వారా స్పష్టం చేశాడు. సినిమా రిలీజయ్యాక ఎవరి నిర్ణయం రైట్, ఎవరిది రాంగనేది తేలుతుంది కానీ ప్రతి రీల్ ని ఎంజాయ్ చేస్తూ పాటలు, బీజీఎమ్ కంపోజ్ చేశానని దేవి చెప్పడం బట్టి చూస్తే వ్యహహారం అనుకున్న దాని కన్నా సీరియస్ గానే ఉంది.

సరే పుష్ప 2 సంగతి పక్కనపెడితే మైత్రి బ్యానర్ లోనే దేవిశ్రీ ప్రసాద్ ఇంకో రెండు సినిమాలకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో మొదటిది పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి గబ్బర్ సింగ్ ఫలితాన్ని రిపీట్ చేసే ఉద్దేశంతో కోరి మరీ దేవిని పెట్టుకున్నాడు. రెండోది మైత్రి నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందే రామ్ చరణ్ 17. సుకుమార్ దర్శకత్వంలో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి డిఎస్పినే పని చేయాలి. ఉస్తాద్ ఇంకా చాలా భాగం పెండింగ్ ఉండగా ఆర్సి 17 సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైం ఉంది. మరి మైత్రి అధినేతలు దేవిని కొనసాగిస్తారా అనేదే అసలు ప్రశ్న.

అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని జివి ప్రకాష్ కుమార్ లేదా అనిరుధ్ కి ఇవ్వొచ్చనే వార్తల నేపథ్యంలో ఒకవేళ ఇదే నిజమైతే దేవికి మరో షాక్ కొట్టినట్టే. ఓపెన్ గా మాట్లాడతా అంటూ నేరుగా చురకలు వేసిన దేవిశ్రీ ప్రసాద్ పట్ల మైత్రి అనుసరించబోయే వైఖరి గురించి ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పుష్ప 2 ఫలితం మీద ఎలాంటి ప్రభావం చూపబోవు కానీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యి అందులో తమన్, సామ్, అజనీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనక ఆయువుపట్టుగా నిలిస్తే అప్పుడు దేవిశ్రీ వాదన పలుచబడిపోతుంది. ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియాలంటే ఇంకొక్క పది రోజులు ఆగితే చాలు.

This post was last modified on November 25, 2024 11:54 am

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

25 minutes ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

28 minutes ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

1 hour ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

2 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

3 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

3 hours ago