పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన మాట వాస్తవం. థియేటర్లలోనే కాదు ఇంటా బయటా, సోషల్ మీడియా, రీల్స్, వీడియోస్, కవర్ సాంగ్స్ ఒకటా రెండా కొంత కాలం పాటు ఎక్కడ చూసినా చెవులు చిల్లులు పడేలా హంగామా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఒకరకమైన మెలోడీ టచ్ తో దాన్ని కంపోజ్ చేసిన విధానంతో పాటు ప్రేమైనా శృంగారమైన అమ్మాయి అంగీకారం చాలా ముఖ్యమనే రీతిలో చంద్రబోస్ రాసిన సాహిత్యం పాట స్థాయిని మరింత పెంచింది. అందుకే పుష్ప 2 స్పెషల్ సాంగ్ మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
ఈసారి డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల వచ్చింది. మహేష్ బాబుతో కలిసి కుర్చీమడతపెట్టితో యువతను ఉర్రూతలూపి ఇప్పుడు బన్నీతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందోనని ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఫోటోలు దించుకోండి కానీ నాది మాత్రం భద్రంగా దాచుకోండి లేదంటే దెబ్బలు పడతాయంటూ శ్రీలీల మాటలను పాటగా రాసిన చంద్రబోస్ మరోసారి వెరైటీ ప్రయోగం చేశారు. ఊ అంటావా ఊహు అంటావాతో పోలిస్తే ఈసారి బీట్స్ పెరిగాయి. పాట ప్రారంభానికి కాస్త ఎక్కువ టైం తీసుకున్నారు. కిస్సిక్, దెబ్బలు పడతాయి రెండు పదాలను థీమ్ గా వాడిన దేవిశ్రీ ప్రసాద్ కంపోజింగ్ మెల్లగా ఎక్కేలా ఉంది.
అయితే ఊ అంటావా స్థాయిలో కనెక్ట్ అవుతుందా లేదానేది ఇంకొద్దిరోజులు ఆగి చూడాలి. ఎందుకంటే దేవి పాటలు చాలా మటుకు స్లో పాయిజన్ లా రోజులు గడిచే కొద్దీ రీచ్ పెంచుకుంటాయి. వినగానే అదిరిపోయింది అనిపించుకోకుండా క్రమంగా ఎక్కేసి చార్ట్ బస్టర్ కొట్టేస్తాయి. ప్రస్తుతానికి కిస్సిక్ మీద సోషల్ మీడియాలో పాజిటివ్, నెగటివ్ రెండు రకాల అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇది ఏ పాటకైనా సహజమే. బిగ్ స్క్రీన్ మీద బన్నీ, శ్రీలీల స్టెప్పులు చూశాక తగ్గడమో పెరగడమో జరగొచ్చు. సో స్పందన గురించి ఇప్పటికిప్పుడు స్థిరమైన అభిప్రాయానికి రాలేం కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on November 24, 2024 11:03 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…