టాలీవుడ్ లో అత్యంత బిజీగా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. గత కొన్ని ఏడాదిగా కొత్త రిలీజ్ లేనప్పటికీ రాబోయే పది నెలల్లో ఏకంగా అరడజనుకు పైగా సినిమాలతో పలరించబోతోంది. ముఖ్యంగా పుష్పలో శ్రీవల్లి పాత్ర తనకు ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో తెలిసిందే. ఇవాళ చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ షూటింగ్ అయిపోయాక ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగిందని, తన కెరీర్ పుష్పకు ముందు పుష్పకు తర్వాతలా మారిపోయిందని, ఇంతగా ప్రభావం చూపించిన చిత్రం గురించి తాను ఆస్వాదిస్తున్న సంతోషం మొహంలో చూపించింది.
ఇక స్టేజి మీద ఉన్న తమిళ యాంకర్లు రష్మికను ప్రశ్నిస్తూ మీరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారా అని నేరుగా స్టేజి మీదే కార్నర్ చేశారు. దానికి రష్మిక మందన్న ఏ మాత్రం తొణక్కుండా అది ఎవరో అందరికీ తెలుసని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని నవ్వడంతో ఒక్కసారిగా సమాధానం ఫ్లాష్ అయిపోయింది. అయితే రష్మిక నేరుగా ఏ పేరు చెప్పలేదు. గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్న విజయ్ దేవరకొండతో అనుబంధం పలు సందర్భాల్లో ఫోటోల రూపంలో బయటికి వచ్చినప్పటికీ నేరుగా తమ రిలేషన్ గురించి ఈ ఇద్దరూ ఎప్పుడూ మీడియా ముందు మాట్లాడిన దాఖలాలు లేవు.
మొత్తానికి మాట్లాడింది తక్కువే అయినా సోషల్ మీడియాకు మంచి వైరల్ కంటెంట్ అయితే ఇచ్చింది రష్మిక. పుష్ప 2లో తన క్యారెక్టర్ మీద ప్రత్యేక అంచనాలున్నాయి. బన్నీ భార్యగా దర్శకుడు సుకుమార్ చాలా స్కోప్ పెంచాడని, నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అయితే ఊహించని ముగింపు ఉండొచ్చనే ప్రచారం నేపథ్యంలో ఆ ట్విస్టు గురించి కూడా ఆన్ లైన్ లో విస్తృత చర్చ జరుగుతోంది. శ్రీలీల ఐటెం సాంగ్ కు సంబంధించిన లాంచ్ అయినప్పటికీ రష్మిక మందన్న కూడా తనతో పోటీగా వేదిక మీద గ్లామర్ అట్రాక్షన్ అయ్యింది. ఇంకో పది రోజుల్లో సస్పెన్స్ వీడిపోతుంది.
This post was last modified on November 24, 2024 10:44 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…